తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోయిన్ సమంత-గాయని చిన్మయి మధ్య ఉన్న స్నేహబంధం తెలిసిందే. అయితే గతంలో వీరిద్దరి మధ్య మనస్పర్థలు కూడా వచ్చాయని వార్తలు కూడా వచ్చాయి. వీరద్దరు వాటిపై పరోక్షంగా కూడా స్పందించారు. తామిద్దరు బాగానే ఉన్నట్లు ఒకరి గురించి మరొకరు ట్వీట్లు కూడా చేసుకున్నారు. అయితే మళ్లీ చాలా కాలం తర్వాత తన స్నేహితురాలు చిన్మయి గురించి ఓ ట్వీట్ చేశారు సమంత. చిన్మయిని క్వీన్ అంటూ అభివర్ణించారు. ఎంతోకాలం తర్వాత వీరిద్దరి మధ్య ఈ సంభాషణ జరగడంతో ఇప్పుడీ ట్వీట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారంటే..
మయోసైటిస్ నుంచి కోలుకున్న సామ్.. తాజాగా సిటాడెల్ షూటింగ్లో బిజీ కానుంది. తాము తెరకెక్కించనున్న సిరీస్‌లోకి సామ్‌కు స్వాగతం పలుకుతూ హాలీవుడ్ దర్శక ద్వయం రస్సో బ్రదర్స్ ఓ ట్వీట్ చేశారు. దీనిపై చిన్మయి భర్త రాహుల్ స్పందిస్తూ.. "సామ్ ప్రయాణం ఎలా మొదలైందో నాకింకా గుర్తుంది. హాలీవుడ్ ప్రముఖ దర్శకులు రస్సో బ్రదర్స్.. సామ్‌ను తమ ప్రాజెక్ట్‌లోకి ఆహ్వానించడం చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది" అని పేర్కొన్నారు. దీనిపై చిన్మయి స్పందిస్తూ "సమంత ఓ క్వీన్.. ఇదే నిదర్శనం" అని ప్రశంసించారు. దీనిపై సామ్ కామెంట్ చేస్తూ.. "నేను కాదు నువ్వే చిన్మయి. అలాగే రాహుల్ లాంటి మంచి స్నేహితుడు నాకు దొరకడం నిజంగా నా అదృష్టం" అని బదులిచ్చింది.