Samantha Salman khan: తనను గుర్తించిన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌కు స్టార్ హీరోయిన్ సమంత ప్రేమతో కృతజ్ఞతలు తెలిపారు. 'పుష్ప'లో సమంత స్టెప్పులేసిన 'ఊ అంటావా మావ ఊఊ అంటావా' అనే పాట తనకెంతో నచ్చిందని ఇటీవల జరిగిన ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం ఐఫాలో సల్మాన్ అన్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోని ఓ నెటిజన్ ట్విటర్‌లో షేర్ చేయగా.. అది సామ్ కంటపడింది. ఆ వీడియోపై ఆమె స్పందిస్తూ లవ్ సింబల్ ఎమోజీతో సల్మాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
సల్మాన్‌కు ప్రేమతో సమంత.. ఆ వీడియోను షేర్ చేసి.. - సమంత సల్మాన్ ఖాన్ సినిమా
Samantha Salman khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌కు ప్రేమతో కృతజ్ఞతలు తెలిపారు హీరోయిన్ సమంత. ఓ స్పెషల్ వీడియోను పోస్ట్ చేసి దానికి లవ్ సింబల్ ఎమోజీలను జత చేశారు. ఎందుకంటే..
ఇక, అల్లుఅర్జున్ హీరోగా నటించిన 'పుష్ప' ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా కోసం సామ్ మొదటిసారి ఐటమ్ సాంగ్ చేశారు. ఇందులో ఆమె బన్నీతో కలిసి వేసిన స్టెప్పులు ఆకర్షించాయి. రెండో భాగం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. కాగా, ప్రస్తుతం 'శాకుంతలం', 'ఖుషి' చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోన్న సామ్ త్వరలోనే సల్మాన్‌ఖాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీచూడండి: హరీశ్శంకర్తో సినిమా.. బన్నీ-రామ్.. చేసేదెవరు?