Samantha counter on netizens: సమంతతో విడిపోయాక యువ హీరో నాగచైతన్య.. గత కొద్ది రోజులుగా ఓ హీరోయిన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. సోషల్‌మీడియాలో ఇదే విషయం తెగ ట్రెండ్ అవుతోంది. అయితే ఇదంతా సామ్‌కు చెందిన పీఆర్ టీమ్ చేస్తుందని చై అభిమానులు నెట్టింట్లో ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. మొత్తంగా ఈ ఇద్దరి ఫ్యాన్స్ మధ్య సోషల్‌మీడియాలో పెద్ద రచ్చే జరిగి ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.
'ఆమెతో చైతూ డేటింగ్!'.. 'ఎదగండి అబ్బాయిలూ..' అంటూ సమంత ట్వీట్ - nagachaitanya sobhita dhulipal love
Samantha counter on netizens: హీరోయిన్ సమంత.. తనను ట్రోల్ చేసేవారికి గట్టి సమాధానమిచ్చింది. తనను విమర్శించడం మానేసి పని, కుటుంబం మీద దృష్టి పెట్టాలని సమాధానమిచ్చింది.
అయితే తాజాగా సమంత ఈ విషయమై స్పందించింది. తనను ట్రోల్ చేసేవారికి గట్టి కౌంటర్ ఇచ్చింది. "అమ్మాయిపై పుకార్లు వస్తే నిజమే అనుకుంటారు. అబ్బాయిపై పుకార్లు వస్తే అమ్మాయే చేయించిదనుకుంటారు ఇకనైనా ఎదగండి అబ్బాయిలూ.. ఎదగండి. ఈ విషయంలో సంబంధం ఉన్నవాళ్లు అని మర్చిపోయి ముందుకు సాగిపోయారు.. మీరు వెళ్లండి.. మీ పని, కుటుంబం మీద దృష్టి పెట్టండి" అంటూ ఘాటు బదులిచ్చింది. కాగా, సామ్ త్వరలోనే.. శాకుంతలం, యశోద చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్‌దేవరకొండతో ఖుషి సినిమాలో నటిస్తోంది. మరోవైపు నాగ చైతన్య నటించిన 'లాల్ సింగ్ చద్ధా', 'థ్యాంక్యూ' విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇంకా మరి ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇదీ చూడండి: 'భలే భలే' దర్శకుడితో నాని కొత్త సినిమా..