తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మంచి జోడీ కోసం వెతుకుతున్నాను! : సమంత పోస్ట్ వైరల్​ - మంచి జోడీ కోసం వెతుకుతున్న సమంత

హీరోయిన్ సమంత తాజా పోస్ట్ వైరల్​గా మారింది. అందులో ఆమె.. సూటబుల్​ మ్యాచ్​ కోసం వెతుకుతున్నట్లు తెలిపింది. ఆ వివరాలు..

Samantha
మంచి జోడీ కోసం వెతుకుతున్నాను! : సమంత పోస్ట్ వైరల్​

By

Published : May 20, 2023, 3:43 PM IST

Updated : May 20, 2023, 3:58 PM IST

సౌత్ హీరోయిన్ సమంత.. ఎప్పటికప్పుడు తనని తాను కొత్తగా మార్చుకుంటూ ఎదురైన సమస్యలను దాటుకుని ముందుకెళ్తోంది. కొంతకాలం క్రితం అక్కినేని హీరో నాగచైతన్యతో విడాకులు తీసుకుని కెరీర్​లో ఫుల్​ బిజీగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం తాను మంచి జోడీ కోసం వెతుకుతున్నట్లు అంటోంది. అయితే ఆ జోడీ తనకోసం కాదట. సెలబ్రిటీలకు ట్రీట్మెంట్​ చేసే డాక్టర్‌ జెవల్‌ గమాడియా కోసం అని చెప్పింది. 'డాక్టర్‌ జెవల్‌ గమాడియాకు సరిపోయే మ్యాచ్‌ కోసం వెతుకుతున్నాం. అతడు కనిపించేదాని కన్నా తెలివైనవాడు. నేను గ్యారంటీ' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చింది సామ్‌.

ఇంతకీ ఆ డాక్టర్‌ ఎవరా అని ఆలోచిస్తున్నారా? అతడు ఎంతో బాలీవుడ్‌ సెలబ్రిటీలకు చికిత్సను అందించాడు. అనుష్క శర్మ, కత్రినా కైఫ్‌, అజయ్‌ దేవ్‌గణ్‌.. ఇంకా ఎందరో తారలు అతడి దగ్గరే చికిత్సను తీసుకున్నారు. సెలబ్రిటీలకు ఆయన వెస్టర్న్‌ అక్యుపెంచర్‌ ద్వారా చికిత్స అందిస్తాడు. సమంత పెట్టిన పోస్ట్‌ చూస్తుంటే.. ఆమె కూడా ఆ ట్రీట్మెంట్​ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సామ్​ పోస్ట్‌ చూసిన నెటిజన్లు.. సమంత విడాకులు తీసుకున్నప్పటికీ ఆమెకు వివాహ బంధంపై నమ్మకం మాత్రం అలాగే ఉందని అభిప్రాయపడుతున్నారు.

సమంత పోస్ట్

ఇకపోతే సమంత.. గతేడాది మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడింది. దీంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్ కూడా ఇచ్చింది. ఆ తర్వాత చికిత్స తీసుకుంటూనే షూటింగ్స్​ను పూర్తి చేసింది. ఈ క్రమంలోనే చివరగా యశోద, శాకుంతలం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించలేకపోయింది. శాకుంతలం అయితే బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్​గా నిలిచింది. దీంతో అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌పై ఫుల్​ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఆమె శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' చిత్రంలో నటిస్తోంది. ఇందులో రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్నాడు. అలాగే ఈ ముద్దుగుమ్మ 'సిటాడెల్‌' అనే హిందీ వెబ్‌ సిరీస్‌లోనూ నటిస్తోంది. రాజ్​ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్​లో వరుణ్ ధావన్‌ కీ రోల్​లో నటిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్​లు హిట్ అయితేనే సామ్ కెరీర్​ సరిగ్గా ముందుకెళ్తుంది. లేదంటే ఆమె​ మార్కెట్​పై ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ రెండింటితో విజయాలను అందుకోవాలని సామ్​ ప్రయత్నిస్తోంది. ఇకపోతే ఆమె లేడీ డైరెక్టర్​ నందినిరెడ్డితోనూ ఓ సినిమా చేసే అవకాశాలను ఉన్నాయని అంటున్నారు. ఇందులో యంగ్ హీరో 'డీజే టిల్లు' ఫేమ్​ సిద్ధు జొన్నలగ్గడ నటించనున్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్​ సెట్స్​పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Bichagadu 2 collection :'బిచ్చగాడు 2'కు మొదటి రోజు ఊహించని కలెక్షన్స్​.. కోట్లలో!

Last Updated : May 20, 2023, 3:58 PM IST

ABOUT THE AUTHOR

...view details