తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బోల్తా కొట్టినా ఆరు ఇంటర్నేషనల్ అవార్డులు.. 'శాకుంతలం'పై సామ్​ రియాక్షన్​!

బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టి సమంత శాకుంతలం వరుసగా అంతర్జాతీయ అవార్డులను అందుకుంటోంది. రీసెంట్​గా రెండు పురస్కారాలను దక్కించుకున్న ఈ సినిమా ఇప్పుడు ఏకంగా నాలుగు అవార్డులను ముద్దాడింది. ఆ వివరాలు..

Etv Bharat
'శాకుంతలం' ఘనత.. బోల్తా కొట్టినా.. ఆరు ఇంటర్నేషనల్ అవార్డులు!

By

Published : May 28, 2023, 3:47 PM IST

Shaakuntalam movie : సౌత్ ఇండస్ట్రీ స్టార్​ హీరోయిన్​ సమంత, మలయాళ యాక్టర్​ దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'శాకుంతలం'. డైరెక్టర్​ గుణశేఖర్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్‌ 14న వరల్డ్​వైడ్​గా గ్రాండ్​గా రిలీజైంది. కానీ ఫస్ట్​ డే ఫస్ట్ షో నుంచే బాక్సాఫీస్ వద్ద నెగటివ్​ టాక్​ తెచ్చుకుని బోల్తా కొట్టంది. ఆడియెన్స్​ ఆశించినంత స్థాయిలో అంచనాలను అందుకోలేక చతికిలపడింది. వసూళ్లను కూడా ఏమీ రాలేదు. నిర్మాతలకు నష్టం చేకూరిందని వార్తలు కూడా వచ్చాయి.

Shaakuntalam Cannes film festival awards: అయితే సమంత ఫ్యాన్స్​ను, ఆడియెన్స్​ను మెప్పించలేకపోయిన ఈ సినిమా.. అవార్డులను మాత్రం అంతర్జాతీయ స్థాయిలో అందుకుంటోంది. సామ్​ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ డిజాస్టర్‌గా నిలిచిపోయిన ఈ చిత్రం.. గతంలో న్యూయార్క్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్స్ అవార్డ్స్- 2023లో బెస్ట్ ఫాంట‌సీ ఫిల్మ్‌గా,బెస్ట్ మ్యూజిక‌ల్ ఫిల్మ్‌గా అవార్డులను దక్కించుకుంది. తాజాగా ఇప్పుడు ఫ్రాన్స్‌లో కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ పురస్కారాలను ముద్దాడింది. ఈ సినిమా నాలుగు విభాగాల్లో అవార్డులను సాధించింది. బెస్ట్ ఫారిన్ ఫిల్మ్, బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ ఇండియన్ ఫిల్మ్ కేటగిరీల్లో పురస్కారాలను ముద్దాడింది. ఈ విషయాన్ని తెలుపుతూ మూవీటీమ్​.. సోషల్ మీడియాలో ఫొటోలను పోస్ట్ చేసింది. అయితే దీనిపై సోషల్​మీడియా యూజర్స్​ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో అభినందనలు తెలుపుతుంటే.. మరికొందరేమో అవసరమా ఈ సినిమాకు అవార్డులు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మరోవైపు సమంత కూడా ఆనందం వ్యక్తం చేసింది. తమ చిత్రాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పింది.

Shaakuntalam Amazon Prime : ఈ సినిమా డిజాస్టర్​ టాక్​ అందుకోవడంతో.. థియేట‌ర్ల‌లో రిలీజై నెల రోజులు కాకుండానే.. డిజిటల్​ ప్లాట్​ఫామ్​ ఓటీటీలోకి విడుదల చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్​ ప్రైమ్​లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక అత్యంత భారీ బడ్జెట్​తో రూపొందిన ఈ చిత్రానికి నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరించారు. దిల్‌రాజు సమర్పకుడిగా వ్యవహరించారు. సామ్​తో పాటు దేవ్‌ మోహన్‌, మోహన్‌బాబు, మధుబాల, గౌతమి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ టాక్​ను అందుకుంది. కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా గుణశేఖర్​ దీన్ని రూపొందించారు. ఇందులో సామ్​ శకుంతల పాత్ర పోషించగా.. దేవ్‌ మోహన్‌ దుష్యంతుడి పాత్రలో కనిపించారు. శకుంతల, దుష్యంత మహారాజుల మధ్య ఉన్న అజరామరమైన ప్రణయ గాథ నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా.. సాయిమాధవ్‌ బుర్రా , మాటలు అందించారు. శేఖర్‌ వి.జోసెఫ్‌ ఛాయాగ్రహణం అందించారు.

ABOUT THE AUTHOR

...view details