స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'యశోద'. ఈ చిత్రం నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. యశోద సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం చిత్రబృందం హాలీవుడ్ స్టంట్‌మ్యాన్‌తో సమంతకు శిక్షణ ఇప్పించారట. 'ది ఫ్యామిలీమ్యాన్2' కోసం పనిచేసిన యానిక్ బెన్ ఆధ్వర్యంలో యశోద చిత్రానికి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కించారని సమాచారం.
ఆ సినిమా కోసం సమంత అంత రిస్క్ చేసిందా? - యశోద కోసం సమంత రిస్క్
ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న హీరోయిన్ సమంత.. ఓ చిత్రం కోసం రిస్క్ చేసినట్లు తెలిసింది. ఏంటంటే?
కాగా, టీజర్ విడుదలైన దగ్గర నుంచే సమంత అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. హరి, హరీష్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలవ్వనున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక సామ్ ప్రస్తుతం గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ప్రేమకావ్యం 'శాకుంతలం'తో పాటు, శివ నిర్వాణ దర్శకత్వంలో రానున్న 'ఖుషి'లో నటిస్తోంది.