తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సమంత పక్కా ప్లాన్​.. ఇకపై దానిపైనే ఫోకస్​! - సమంత రిజెక్ట్ చేసిన ప్రాజెక్ట్స్​

సినిమాల విషయానికి సంబంధించి హీరోయిన్ సమంత ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఆ వివరాలు..

Samantha
సమంత పక్కా ప్లాన్​.. ఇకపై దానిపైనే ఫోకస్​!

By

Published : Feb 15, 2023, 7:52 PM IST

ఓ వైపు సినిమాలతో మరోవైపు వెబ్​సిరీస్​తో మళ్లీ బిజీ అవుతున్నారు స్టార్ హీరోయిన్​ సమంత. పుష్ప సినిమాలో ప్రత్యేక గీతం ఊ అంటావా మావాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ఆమెకు ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా వరుస అవకాశాలు వస్తున్నాయి. అయితే మయోసైటిస్ వ్యాధి కారణంగా చాలా రోజుల పాటు ఇంటికే పరిమితమైన సామ్.. ప్రస్తుతం కోలుకుని షూటింగ్స్​లో పాల్గొంటున్నారు. సిటాడెల్​ వెబ్​సిరీస్​ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అయితే కథలు, పాత్రల ఎంపికపై మరింత దృష్టి పెట్టారని తెలుస్తోంది. రీసెంట్​గా పుష్ప2 చిత్రంలో నటించాల్సిందిగా మేకర్స్.. ఆమెను కోరగా సామ్​ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.

దీంతోపాటే నేచురల్ స్టార్ నాని నటించిన దసరా మూవీ కోసం.. కొంత కాలం క్రితం ఆ చిత్రబృందం సమంతను సంప్రదించారట. దీన్ని కూడా ఆమె రిజెక్ట్ చేశారని తెలిసింది. కమర్షియల్​, రెగ్యులర్​ పాత్రలను ఆమె దూరం పెట్టినట్లు తెలుస్తోంది. కేవలం భిన్నమైన కథలు, పాత్రలను మాత్రమే చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారట. ముఖ్యంగా బాలీవుడ్​పైనే ఫూర్తి ఫోకస్​ పెట్టాలని అనుకుంటున్నారట. అలాగే ఒక సారి పోషించిన పాత్రలో మరో సారి నటించకుండా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారట. మరి ఇందులో నిజమెంతో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక సమంత సినీ కెరీర్‌ విషయానికొస్తే.. ప్రస్తుతం గుణశేఖర్‌ దర్శకత్వంలో ఆమె ప్రధాన పాత్ర పోషించిన శాకుంతలం ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. శివ నిర్వాణ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఖుషిలో ఆమె విజయ్‌ దేవరకొండ సరసన నటిస్తున్నారు. వరుణ్‌ ధావన్‌తో కలిసి హిందీ సిటాడెల్‌ వెబ్‌సిరీస్‌లో కనిపించనున్నారు.

ఇదీ చూడండి:రామ్​చరణ్​ మొదటి క్రష్​ ఎవరో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details