Samantha u Antava Song : 'ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా' పాట అప్పట్లో ఇంటర్నెట్ను షేక్ చేసింది. ఇందులో స్టార్ హీరోయిన్ సమంత చేసిన డ్యాన్స్ అభిమానుల మనుసుల్లో నిలిచిపోయింది. సెలబ్రిటీల నుంచి సినిమా అభిమానుల వరకూ అందరినీ ఉర్రూతలూగించింది. ఇంత సంచలనం సృష్టించిన ఈ పాటకు సమంత ఇటీవలే మరోసారి డ్యాన్స్ చేశారు.
'సిటాడెల్' (ఇండియన్ వెర్షన్) షూటింగ్ కోసం సెర్బియా వెళ్లిన సమంత.. ఓ క్లబ్‌లో సరదాగా స్టెప్పులు వేశారు. అక్కడే ఉన్న బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ ఆమెను డ్యాన్స్ చేయమని ప్రోత్సహించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు 'పాట వచ్చి రెండేళ్లు అవుతున్నా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు' అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
'శాకుంతలం' సినిమా తర్వాత సమంత యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ వెబ్ సిరీస్ 'సిటాడెల్'లో నటిస్తోంది. దీనికి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సిరీస్‌లో వరుణ్ ధావన్ - సామ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇండియాలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ టీమ్.. కొత్త షెడ్యూల్ కోసం రీసెంట్ గా సెర్బియా వెళ్లింది. బెల్‌గ్రేడ్‌లో షూటింగ్ ముగిసిన వెంటనే, టీమ్ మొత్తం క్లబ్‌కి వెళ్లి సరదాగా గడిపారు. ఈ సమయంలో క్లబ్‌లో 'ఊ అంటావా మావా' అనే పాటను ప్లే చేసి సామ్ డ్యాన్స్ చేసింది. అలాగే ప్రియాంక చోప్రా నటించిన 'సిటాడెల్' చిత్రానికి ప్రీక్వెల్‌గా ఈ సిరీస్ రూపొందుతున్నట్లు సమాచారం. ప్రియాంకకు తల్లిదండ్రులుగా సామ్, వరుణ్‌లు కనిపిస్తారని వార్తలు వస్తున్నాయి.
రాష్ట్రపతిని కలిసిన సమంత.. అందుకే!
ఇటీవలే సెర్బియా వెళ్లిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సమంత కలిశారు. సమంతతోపాటు వరుణ్ ధావన్, 'సిటాడల్' వెబ్‌సిరీస్ దర్శకులు రాజ్, డీకే కూడా ఉన్నారు. ముర్ముతో కాసేపు వీరంతా ముచ్చటించారు. ఈ మర్యాదపూర్వక భేటీకు సంబంధించిన ఫొటోలను వరుణ్ ధావన్.. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
"సిటాడెల్ టీమ్‌కు.. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసే అదృష్టం దక్కింది. ఇది మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. మిమ్మల్ని (ద్రౌపదీ ముర్ము) కలవడం ఎంతో అమ్మా" అంటూ వరుణ్ ధావన్ రాసుకొచ్చారు. అయితే వరుణ్ పోస్ట్‌ను సమంత ఇన్‌స్టాలో రీషేర్ చేసింది. "మేడమ్ ప్రెసిడెంట్" అంటూ రాసుకొచ్చింది. అయితే ఆ ఫొటోల్లో సమంత క్యూట్ హెయిర్ స్టైల్‌తో కళ్లజోడు పెట్టుకుని కొత్తగా కనిపించింది.