Samantha New york : అమెరికాలోని న్యూయార్క్ వేదికగా జరిగిన 'ఇండియా డే పరేడ్ 'లో మరోసారి సినీ తారలు మెరిశారు. ఆదివారం జరిగిన ఈ గ్రాండ్ ఈవెంట్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్సమంతతో పాటు బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ , ఆర్ట్ ఆఫ్ లివింగ్ రూపకర్త ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ పాల్గొని సందడి చేశారు. వేడుకలో భాగంగా ఏర్పాటు చేసిన శకటాలపై నిలబడిన జాక్వెలిన్ జాతీయ జెండాను ఊపుతూ కనిపించారు.ఇక పరేడ్‌లో పాల్గొన్న సామ్.. న్యూయార్క్ వీధుల్లో నడూస్తూ అభిమానుల్లో ఉత్సహాన్ని నింపారు. ఆ తర్వాత జరిగిన సమవేశంలో మాట్లాడిన సామ్.. తనకు ఈ అవకాశం దక్కినందుకు ఎంతో ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చారు.
"ఈ రోజు ఇక్కడ ఉండటం నిజంగా నాకు గర్వకారణంగా ఉంది. నా సంస్కృతి, వారసత్వం ఎంత గొప్పదో మీరు నాకు అర్థమయ్యేలా చేశారు. ఈ రోజు నేను చూసిన ప్రతి విషయం నాకు జీవితాంతం గుర్తుంటుంది. ఇంతవరకు ఇచ్చిన సపోర్ట్‌కు అందరికి థ్యాంక్స్. నా ప్రతి సినిమాను ఆదరిస్తున్నందుకు అమెరికాకు ధన్యవాదాలు. సెప్టెంబర్ 1న 'ఖషి'ని చూడండి. ఐ లవ్ యూ. మీ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు" అని సమంత అన్నారు.
New york India Day Parade : ఒక్క సామ్, జాక్వెలినే కాదు గతంలో అనేక మంది సెలబ్రిటీలు ఈ పరేడ్‌కు హాజరై మెరిశారు. అందులో బాలీవుడ్ స్టార్స్ అర్జున్ రాంపాల్, అభిషేక్ బచ్చన్, సన్నీ డియోల్, రవీనా టాండన్‌లతో పాటు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా వేడుకలో కనిపించి అభిమానులను అలరించారు.