తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

శాకుంతలం టీమ్​ నుంచి గుడ్​ న్యూస్​.. రిలీజ్ డేట్​ ఇదే.. - శాకుంతలం మూవీ పోస్టర్​

శాకుంతలం మూవీ అప్డేట్స్​ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్​కు ఓ తీపి కబురు అందించింది చిత్ర బృందం. మూవీ రిలీజ్​ డేట్​తో పాటు ఓ మోషన్​ పోస్టర్​ను శుక్రవారం రిలీజ్​ చేసింది.

samantha-new-movie-shaakuntalam-release-date-announced
samantha-new-movie-shaakuntalam-release-date-announced

By

Published : Sep 23, 2022, 1:02 PM IST

Shakuntalam Movie Updates : సమంత కీలక పాత్రలో తెరకెక్కుతున్న శాకుంతలం మూవీ రిలీజ్​ డేట్​ను చిత్ర బృందం అనౌన్స్​ చేసింది. నవంబర్‌ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు కొత్త ఫొటో‌తో పాటు ఓ మోషన్‌ పోస్టర్‌ను అభిమానుల కోసం షేర్ చేసింది మూవీ టీమ్​.

మహాభారతం ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమకథను ఆధారంగా చేసుకుని 'శాకుంతలం'గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శకుంతల పాత్రలో సమంత, దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌ నటించారు. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు గుణ శేఖర్‌ కుమార్తె నీలిమ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అల్లు అర్జున్​ కూతురు అల్లు అర్హ కూడా ఈ సినిమాలో ఓ పాత్ర పోషిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details