తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అస్వస్థతతో సామ్​ ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు.. క్లారిటీ ఇచ్చిన మేనేజర్‌ - samantha latest updates

ప్రముఖ సినీనటి సమంత ఆరోగ్యం విషయంలో తమిళ మీడియాలో వస్తున్న కథనాలపై ఆమె మేనేజర్‌ స్పందించారు.

samantha
samantha

By

Published : Nov 24, 2022, 11:00 AM IST

Samantha Health: స్టార్‌ హీరోయిన్‌ సమంత ఆరోగ్యంపై మళ్లీ ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఆమె అస్వస్థతతో ఆసుపత్రిలో చేరినట్టు తమిళ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఇవన్నీ వదంతులేనని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె ఇంట్లోనే క్షేమంగా ఉందంటూ స్పష్టం చేశారు. మరోవైపు సామ్‌ ఆరోగ్యంపై వస్తున్న ఫేక్‌ న్యూస్‌ను నమ్మొద్దని ఆమె మేనేజర్‌ కోరారు.

కాగా కొద్ది రోజులుగా సామ్ మయోసైటిస్ అనే సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ.. యశోద సినిమాకు డబ్బింగ్‌ చెప్పారు. ఈ చిత్రం నవంబర్‌ 11న థియేటర్స్‌లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకత్వం వహించారు.

ఇదీ చదవండి:నటుడు కమల్ ​హాసన్​కు స్వల్ప అస్వస్థత.. చెన్నై ఆస్పత్రిలో చికిత్స

ABOUT THE AUTHOR

...view details