తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'అప్పుడు సరిగ్గా నడవలేకపోయావు.. అవన్నీ గుర్తుపెట్టుకో' - సమంత శాకుంతలం సినిమా

టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ సమంత మయోసైటిస్​ నుంచి కోలుకుని సినిమాల్లో బిజీ అయిపోయారు. తాజాగా తన సోషల్​ మీడియా అకౌంట్​లో ఆమె వర్క్​లైఫ్​ గురించి ఫొటోలు షేర్​ చేశారు. గత ఎనిమిది నెలలుగా చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నానని తెలిపారు. ఇంకా ఏమన్నారంటే..

samantha latest post on her january schedule
samantha latest post on her january schedule

By

Published : Feb 3, 2023, 9:06 PM IST

టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ సమంత మళ్లీ కెరీర్​పై దృష్టి సారిస్తున్నారు. మయోసైటిస్​ అనే వ్యాధితో బాధపడుతున్న సమంత కోలుకుని వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఈ ముద్దుగుమ్మ నటించిన 'శాకుంతలం' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్​లో బీజీగా ఉన్నారు సమంత. ఇదే కాకుండా సమంత నటిస్తున్న మరో చిత్రం 'సిటాడెల్' షూటింగ్ కూడా ప్రారంభమైంది. అందులో భాగంగా, ఆమె వర్క్​ లైఫ్​కు సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్​ మీడియాలో షేర్​ చేశారు. జనవరి నెలలో తన జీవితం ఎలా గడిచిందో ఈ ఫొటోలతో తెలిపారు. 'సిటాడెల్‌' చిత్ర బృందంతో జరిగిన మీటింగ్​లు, వర్కౌట్లు, అలసట, ఫొటోషూట్​లతో గత నెల పూర్తైందని చెప్పారు. దాంతో పాటు మరో పోస్ట్​ షేర్​ చేస్తూ.. తనకు తాను ధైర్యం చెప్పుకునే ప్రయత్నం చేశారు.

మూవీ టీమ్​తో సమంత

''గట్టిగా ఊపిరి పీల్చుకో పాప. త్వరలో అంతా బాగానే ఉంటుందని నేను నీకు మాటిస్తున్నా. గడిచిన ఏడెనిమిది నెలలుగా నువ్వు అత్యంత ఇబ్బందికరమైన రోజులను చూశావు. వాటిని మర్చిపోవద్దు. ఆ క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నావో ఎప్పటికీ గుర్తుపెట్టుకో. ఆలోచించడం మానేశావు.. దేనిపైనా దృష్టిపెట్టలేకపోయావు.. సరిగ్గా నడవలేకపోయావు.. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ధైర్యంగా ముందుకు అడుగేశావు. నీ విషయంలో నేను ఎంతో గర్వంగా ఉన్నా. నువ్వు కూడా నాలాగే గర్వపడు. ధైర్యంగా మరింత ముందుకు సాగిపో'' అని సమంత పోస్ట్​లో రాసుకొచ్చారు.

ABOUT THE AUTHOR

...view details