Samantha Latest Instagram Post : ఏ మాయ చేశావే అంటూ టాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సమంత... ఏళ్లు గడిచినా ఇప్పటికీ తన క్యూట్ గ్లామర్, యాక్టింగ్‌తో మాయ చేస్తూనే ఉంది. అతి తక్కువ కాలంలోనే బడా హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది.
Samantha Foreign Trip : అయితే ఆ మధ్యలో మయోటైటిస్ బారిన పడిన సమంత.. ప్రస్తుతం ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనుందని జోరుగా ప్రచారం సాగింది. ఆ ప్రచారానికి తగ్గట్టే ఆమె ఇప్పటివరకు ఏ సినిమాను అనౌన్స్ చేయలేదు. షూటింగ్లలో పాల్గొనట్లేదు. రీసెంట్గా విజయ్ దేవరకొండతో ఖుషి, సిటాడెల్ ఇండియన్ వెబ్‌సిరీస్ చిత్రీకరణలను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం లైఫ్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. తన స్నేహితురాలితో కలిసి ఫారెన్స్ ట్రిప్స్ అంటూ సరదాగా గడుపుతోంది. అక్కడ దిగిన ఫొటోలను వీడియోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ అలరిస్తోంది.
అయితే ఆమె ఎప్పుడూ సోషల్‌మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు ఫిలాసఫీకి సంబంధించి కొన్ని కొటేషన్స్ కూడా పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా మరో సిద్ధాంతాన్ని చెప్పుకొచ్చింది. 'ఒకవేళ మీరు బొద్దింకను చంపితే హీరో అవుతారు... అదే సీతకోక చిలుకను చంపితే విలన్ అవుతారు. నైతికతకు కూడా సౌందర్య ప్రమాణాలు ఉన్నాయి' అంటూ రాసుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్లు సామ్ ఇలా ఎందుకు రాసుకొచ్చిందో అని ఆలోచిస్తున్నారు.