Samantha Health Condition :కెరీర్ నుంచి ఏడాది పాటు కాస్త బ్రేక్ తీసుకుని ప్రస్తుతం పర్సనల్ లైఫ్ అండ్ ట్రావెలింగ్‌పై హీరోయిన్ సమంత ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. చిన్నప్పటి నుంచి తాను చూడాలని ఎన్నో కలలు కన్న అన్ని ప్రాంతాలను చుట్టేస్తూ లైఫ్ గడిపేస్తోంది. తన మయోసైటిస్ ట్రీట్మెంట్ కోసం అలాగే సంపూర్ణ ఆరోగ్యం కోసం లైఫ్‌ను ప్రశాంతంగా గడుపుతోంది.
అలా ఓ వైపు మందులను వినియోగిస్తూనే మరోవైపు మనసు ఉల్లాసంగా ఉండేందుకు ప్రకృతిని ఆస్వాదిస్తోంది. ఆ మధ్య కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్‌తో తన ట్రావెలింగ్‌ను షురూ చేసి.. ఆ తర్వాత ఇండోనేషియాలోని బాలి, అమెరికా న్యూయార్క్, ఆస్ట్రియా.. ఇలా వరుసగా తిరిగేసింది. తాజాగా ఆమె హైదారాబద్ చేరుకున్నట్లు తెలిసింది. తన సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసి అభిమానులతో పంచుకుంది.
అందులో హాస్పిటల్ వెళ్లి బెడ్‌పై చేతికి డ్రిప్స్ పెట్టుకుని కనిపించింది. "ఇమ్యూనిటీ పెరగడం వల్ల ఉపయోగాలు ఉన్నాయి. వెట్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్ పెరుగుతుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ ఫంక్షన్ బాగా పని చేస్తుంది. గుండె, ఇతర కండరాల ఫంక్షన్ బాగా పని చేస్తుంది. వైరస్‌తో పోరాడే శక్తి పెరుగుతుంది. కార్డియోవాస్కులకర్ సిస్టమ్‌తో పాటు ఎముకలు కూడా గట్టిగా ఉంటాయి" అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు సమంత త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు.