Samantha Emotional Post: హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ మూవీ 'యశోద'. ఈ మూవీలో సామ్ అమాయకంగా కనిపిస్తూనే యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టిందంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో యాక్షన్ సన్నివేశాల్లో నటించేందుకు సహకరించిన తన ఫిట్‌నెస్ ట్రైనర్ జునైద్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పింది సామ్. ఈ మేరకు సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ షేర్ చేసింది.
'నా కన్నీళ్లు, స్టెరాయిడ్ థెరపీలు అన్నీ చూశావు.. నా వెంటే ఉన్నావ్'.. సామ్ ఎమోషనల్ పోస్ట్ - సమంత యశోద
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ఇన్‌స్టాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. 'యశోద' సినిమాలోని యాక్షన్ సన్నివేశాల్లో నటించేందుకు సహకరించిన తన ఫిట్‌నెస్ ట్రైనర్ జునైద్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పింది సామ్.
"నాకిష్టమైన జిలేబీ తినడానికి జునైద్ ఎప్పుడూ ఒప్పుకోలేదు. కానీ యశోద విజయాన్ని, మరీ ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలను సెలబ్రేట్ చేసుకోవడానికి ఈరోజు జిలేబీ తీసుకొచ్చాడు. గత కొన్ని నెలలుగా నా వెన్నంటి నిలబడినవారిలో నువ్వూ ఒకరివి. నిరాశగా, బలహీనంగా ఉన్నప్పుడు, కన్నీళ్లు పెట్టుకున్న సమయాల్లో, హై డోస్ స్టెరాయిడ్ థెరపీ చేయించుకున్నప్పుడు కూడా నా వెంటే ఉన్నావు. నాతో వర్కౌట్లు చేయించావు. నువ్వు నన్ను గివప్ చేయనివ్వలేదు, ఎప్పటికీ గివప్ చేయనివ్వవు కూడా! నీవల్లే ఇలా మారాను. థాంక్యూ" అని రాసుకొచ్చింది. ఈ పోస్టుకు ఫిట్‌నెస్ ట్రైనర్ ఆప్యాయంగా హత్తుకున్న ఫొటోతో పాటు ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో సమంత చేతికి సెలైన్ స్ట్రిప్ ఉన్నప్పటికీ జిమ్‌లో వర్కౌట్ చేస్తుండటం గమనార్హం.