Coffee with Karan Samantha: 'కాఫీ విత్ కరణ్ 7'షోలో అక్షయ్‌కుమార్‌తో కలిసి సందడి చేశారు హీరోయిన్ సమంత. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో వచ్చేసింది. ఇందులో సమంతను అక్షయ్ ఎత్తుకుని సీటు దగ్గరకు తీసుకొచ్చి హంగామా చేశారు. కరణ్ అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానం చెబుతూ ఈ ఇద్దరు నవ్వులు పంచారు. ఈ క్రమంలోనే 'బ్యాచిలరేట్‌కి మీరు హోస్ట్ అయితే ఏ ఇద్దరు బాలీవుడ్ హీరోలను తీసుకుంటారు?' అని కరణ్ అడగ్గా 'రణ్‌వీర్‌సింగ్, రణ్‌వీర్‌సింగ్' అని సమంత మనసులో మాట బయటపెట్టారు. ఈ సమాధానం వినగానే 'ఓకే' అని అక్షయ్ చిరు నవ్వు చిందించారు. కరణ్‌ను ఉద్దేశిస్తూ 'అన్‌హ్యాపీ మ్యారేజ్‌కు మీరే కారణం' అని సమంత ఆరోపించారు. గతంలో విడుదలైన ఓ ప్రోమోలో వినిపించిన ఈ వ్యాఖ్యకు సంబంధించిన క్లిప్పింగ్ వైరల్‌గా మారింది. మరి, సమంత ఎవరి వివాహం గురించి మాట్లాడారోనని ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పెళ్లి గురించి మాట్లాడిన సామ్.. ఎత్తుకుని హంగామా చేసిన స్టార్ హీరో - కాఫీ విత్ కరణ్ సమంత ప్రోమో
ఓ కార్యక్రమంలో బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్.. హీరోయిన్ సమంతను ఎత్తుకుని హంగామా చేశారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి పలు ఆసక్తికర సంగతులను తెలిపారు. ఆ విశేషాలివీ..
![పెళ్లి గురించి మాట్లాడిన సామ్.. ఎత్తుకుని హంగామా చేసిన స్టార్ హీరో samantha coffee with karan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15867393-thumbnail-3x2-akshay.jpg)
కరణ్ జోహార్‌కు ఫిల్మ్‌మేకర్‌గానే కాకుండా వ్యాఖ్యాతగానూ బాలీవుడ్‌లో మంచి పేరుంది. హోస్ట్‌గా ఆయనకు క్రేజ్ తీసుకొచ్చిన సెలబ్రిటీ టాక్ షో 'కాఫీ విత్ కరణ్'. 6 సీజన్ల బుల్లితెర వేదికగా అలరించిన ఈ షో 7వ సీజన్ ఓటీటీ 'డిస్నీ+హాట్‌స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే రణ్‌వీర్‌సింగ్- అలియాభట్, జాన్వీకపూర్- సారా ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రేక్షకుల్ని అలరించారు. అక్షయ్- సమంతల ఎపిసోడ్ ఈ గురువారం ప్రసారంకానుంది. షాహిద్ కపూర్, కియారా అడ్వాణీ, అనిల్ కపూర్, వరుణ్ ధావన్, విజయ్ దేవరకొండ, అనన్య పాండే త్వరలోనే ఈ వేదికపైకి రానున్నారు. 6 సీజన్ల వరకు బాలీవుడ్ తారలకే పరిమితమైన ఈ షో ఇప్పుడు దక్షిణాది నటులకూ ఆహ్వానం పలికింది. ఈ జాబితాలో నిలిచిన వారే సమంత, విజయ్ దేవరకొండ.
ఇదీ చూడండి: రవితేజ- నిర్మాత సుధాకర్ మధ్య గొడవకు కారణం వాళ్లేనట.. మాస్ మహారాజా క్లారిటీ