తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సినిమాలకు బ్రేక్‌ ఇవ్వనున్న సామ్​.. కారణమిదే! - సమంత బ్రేక్​

Samantha break : హీరోయిన్‌ సమంత తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం చేతినిండా ఆఫర్లతో బిజీగా ఉన్న సామ్​ ప్రస్తుతం సినిమాలకు బ్రేక్​ ఇవ్వనుందట. ఇంతకీ ఏం జరిగిందంటే ?

samantha movies
samantha break

By

Published : Jul 5, 2023, 12:09 PM IST

Updated : Jul 5, 2023, 12:46 PM IST

Samantha break : టాలీవుడ్​ స్టార్ హీరోయిన్​ సమంతతాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి నుంచి మరో ఏడాది పాటు సినిమాలకు బ్రేక్‌ ఇవ్వనుందట. ఈ రూమర్స్​ ప్రస్తుతం నెట్టింట హల్​చల్​ చేస్తున్నాయి. అయితే ఈ విషయంపై సమంత కానీ లేదా ఆమె టీమ్​ కానీ ఎటువంటి అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ ఇవ్వలేదు. ఇటీవల 'శాకుంతలం'తో పలకరించిన సామ్​ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండకు జోడీగా 'ఖుషి' సినిమాలో నటిస్తోంది. మరోవైపు 'సిటాడెల్‌' వెబ్‌సిరీస్‌ షూటింగ్​లోనూ బిజీగా ఉంది. ఈ రెండూ పూర్తయ్యాక.. ఆమె ఓ ఏడాది పాటు సినిమాలకు బ్రేక్‌ ఇవ్వాలని నిర్ణయించుకుందట.

ఇకపోతే సమంత గత కొంత కాలంగా 'మయోసైటిస్‌'కు అనే వ్యాధితో పోరాడుతోంది. ఓ వైపు చికిత్స తీసుకుంటూనే మరోవైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు షూటింగ్‌లకు బ్రేక్‌ ఇచ్చి పూర్తిగా ఆరోగ్యంపైన శ్రద్ధ పెట్టాలని.. దానికి అవసరమైన అదనపు చికిత్స తీసుకోనేందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే 'ఖుషి','సిటాడెల్‌' కాకుండా ఇతర ప్రాజెక్ట్‌లకు ఓకే చేయలేదట. గతంలో అంగీకరించిన కొన్ని సినిమాలకు సంబంధించిన అడ్వాన్సులను కూడా ఆమె తిరిగి నిర్మాతలకు ఇచ్చేసిందని సమాచారం.

'యశోద' సినిమా తర్వాత మయోసైటిస్ కారణంగా బాధపడ్డ సమంత అప్పట్లోనూ కొంత కాలం సినిమాలకు బ్రేక్​ ఇచ్చింది. మయోసైటిస్​కు చికిత్స తీసుకున్న సమంత.. గతేడాది ఖుషి సినిమా షూట్​లో పాల్గొనలేదు. దీంతో అప్పట్లో ఈ సినిమా షూటింగ్​ కూడా కాస్త అంతరాయం కలిగింది. కానీ ఆ తర్వాత 'శాకుంతలం' సినిమాను కంప్లీట్ చేసింది. ఇక ఇప్పుడు విజయ దేవరకొండ 'ఖుషి'తో పాటు, బాలీవుడ్​ సిరీస్​ 'సిటాడెల్' షూటింగ్​ల్లోనూ పాల్గొని నిర్విరామంగా షెడ్యూళ్లను కంప్లీట్​ చేస్తూ వస్తోంది.

Samantha Kushi Movie : ప్రస్తుతం 'ఖుషి' సినిమా షూటింగ్‌ కూడా చివరి దశలో ఉంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 1న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. అయితే సమంత మాత్రం ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొటుందో లేదో అన్న విషయం వేచి చూడాల్సిందే.

Last Updated : Jul 5, 2023, 12:46 PM IST

ABOUT THE AUTHOR

...view details