తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

చైతూ కామెంట్స్​కు సమంత కౌంటర్​.. 'ఇగో వల్లే అలా జరుగుతుందంటూ..' - సమంత గురించి నాగచైతన్య కామెంట్స్

Samantha and Naga Chaitanya divorce : తనపై.. తన మాజీ భర్త నాగచైతన్య చేసిన కామెంట్స్​కు సమంత కౌంటర్​ ఇచ్చారు. ఇన్​స్టా వేదికగా ఓ పోస్ట్​ పెట్టి.. ఇగో వల్లే అలా జరుగుతుందన్నారు. ఇంకా సామ్​ ఏమన్నారంటే?

Samantha and Naga Chaitanya divorce
Samantha and Naga Chaitanya divorce

By

Published : May 6, 2023, 3:47 PM IST

Updated : May 6, 2023, 4:46 PM IST

Samantha and Naga Chaitanya divorce : నాగచైతన్య-సమంత డివోర్స్​ తీసుకున్నాక వీరిద్దరి గురించి రకరకాల రూమర్స్​ సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చాలా కాలం వరకు వీరిద్దరూ.. తాము డివోర్స్​ ఎందుకు తీసుకన్నారన్న విషయంపై ఎక్కడా వెల్లడించలేదు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య.. తొలిసారి సమంత గురించి కామెంట్స్​ చేశారు. ఆమె చాలా లవ్లీ పర్సన్ అని, తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. చైతూ చేసిన వ్యాఖ్యలపై సమంత పరోక్షంగానే స్పందించారు. ఇన్​స్టా వేదికగా ఓ కోట్​ను షేర్​ చేసి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమ ఇగోలు, భయాలే ప్రజలు విడిపోవడానికి కారమమవుతుంది అని పరోక్షంగా చైత్యనకు కౌంటర్ ఇచ్చారు.

samantha insta post : "మనమంతా ఒక్కటే.. ఇగోలు, నమ్మకాలు, భయాలే మనల్ని వేరు చేస్తాయి." అంటూ ఓ పోస్ట్ పెట్టారు. సామ్ పెట్టిన ఈ పోస్ట్​ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ ట్రెండ్ అవుతోంది. అటు సామ్ ఫ్యాన్స్​తో పాటు చైతన్య అభిమానులు కూడా ఈ పోస్ట్​పై రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. 'ఈ పోస్ట్​ను గమనిస్తుంటే బహుశా వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాన్ని ఈ కోట్​ద్వారా సామ్​ వెల్లడించారేమో' అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

సమంత ఇన్​స్టా పోస్ట్​

వీరిద్దరి మధ్య ఎం జరిగిందంటే..!
naga chaitanya custody promotions : నాగ చైతన్య, కృతి శెట్టి లీడ్​ రోల్స్​లో వెంకట్​ ప్రభు తెరకెక్కిస్తున్న'కస్టడీ' సినిమా మే 12 థియేటర్లలో రిలీజయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో మూవీ టీమ్​ ప్రమోషన్లను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సమంతపై చైతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "సామ్ లవ్లీ పర్సన్. అన్ని రకాల ఆనందాలు ఆమెకు దక్కాలి. మీడియాలో వస్తున్న ఉహాగానాల కారణంగానే మా ఇద్దరి మధ్య పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి. ఈ విషయం గురించి నేను కూడా చాలా బాధపడుతున్నాను" అంటూ నాగచైతన్య కామెంట్ చేశారు. అంతే కాకుండా ఇక తామిద్దరం తమ జీవితాల్లో ముందుకు సాగిపోయామని, ప్రస్తుతం తన ఫేజ్‌ను పూర్తిగా గౌరవిస్తున్నానని పేర్కొన్నారు.

ఇక సామ్​.. చైతూ సినిమా లిస్ట్​ను చూస్తే.. వీదిద్దరూ కలిసి నటించిన తొలి సినిమా 'ఏం మాయ చేశావే'. ఆ తర్వాత మనం(2014), ఆటోనగర్ సూర్య(2014), మజిలీ(2019) సినిమాల్లోనూ జంటగా మెరిశారు. ఈ క్రమంలో చాలా రోజుల పాటు సన్నిహితంగా మెలిగిన ఈ జంట.. 2017లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల 2021లో విడిపోతున్నట్లు ప్రకటించిన చైతూ సామ్​.. గతేడాది విడాకులు తీసుకున్నారు.

Last Updated : May 6, 2023, 4:46 PM IST

ABOUT THE AUTHOR

...view details