తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సమంత 10th క్లాస్​ మార్క్స్ మెమో వైరల్​.. వామ్మో ఇన్ని మార్కుల! - సమంత స్కూల్​ మార్క్స్​ లిస్ట్​

మనకు నచ్చిన సెలెబ్రిటీల గురించిన ఏ విషయమైనా ప్రత్యేకమే. తినే తిండి దగ్గర నుంచి రోజూ తీసుకునే డైలీ కేర్​ వరకు అన్నీ తెలుసుకోవాలనే ఆత్రుత అందరిలో ఉంటుంది. మరీ ముఖ్యంగా వారు ఏం చదువుకున్నారు అనే ఆసక్తి అందరిలో ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ క్యూట్ సమంత 10th క్లాస్​ మార్స్క్ మెమో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం తెలుసుకుందామా!

samantha 10th mark sheet viral in social media
సమంత మార్క్స్ మెమో

By

Published : Jan 26, 2023, 3:57 PM IST

సినిమా స్టార్స్ అంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు మరి. కొంత మంది అభిమానులు వారిని మాములుగా ఇష్టపడితే మరికొందరు మాత్రం వారి సోషల్​ లైఫ్​ నుంచి పర్సనల్​ లైఫ్ వరకు అన్నీంటిని తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారు. అలాంటి వారి కోసం తమ అభిమాన తరాలు అప్పుడప్పడు తమ లైఫ్​లో జరిగిన కొన్ని జ్ఞాపకాలను షేర్​ చేస్తుంటారు.

అయితే ఒక్కప్పటి తారల నుంచి ఇప్పటి హీరో హీరోయిన్ల వరకు అందరూ ఏదో ఒక సమయంలో తమ స్కూల్​, కాలేజీ లైఫ్​ను ఎంజాయ్​ చేసి ఉంటారు. వారు కూడా మనలాగే ఎగ్జామ్స్​ రాసి పాస్​ అయ్యి ఇంత దూరం వచ్చిన వారే ఉంటారు. కొందరు డాక్టర్లు, ఇంజనీర్లు అయినప్పటికీ సినిమా మీద మక్కువతో ఈ ఫీల్డ్​లోకి వచ్చుంటారు. మరికొంత మంది చిన్నవయసులోనే సినిమా బాట పట్టుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో తమ స్కూల్​ లైఫ్​ గురించి కచ్చితంగా ఏదో ఒక మధుర జ్ఞాపకాన్ని నెమరు వేసుకుంటుంటారు.

అలా మన టాలీవుడ్​ 'శకుంతల' సమంత కూడా తన లైఫ్​లోని ఓ మధుర జ్ఞాపకాన్ని సోషల్​ మీడియాలో షేర్​ చేసింది. అదే.. తన పదవ తరగతి మార్క్​లిస్ట్. రీసెంట్​గా తన మార్క్​లిస్ట్​ ఫొటోను ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేసింది సమంత.

చెన్నైలోని స్టీఫెన్స్​ మెట్రిక్యూలేషన్​ స్కూల్​లో సమంత పదో తరగతి వరకు చదివింది. అప్పటి మార్క్​ లిస్ట్​లో మొత్తం 1000 మార్కులకు గానూ తనకి 887 మార్కులు వచ్చాయి. మ్యాథ్స్​లో వందకు వంద ఇంగ్లీష్​లో 90, ఫిజిక్స్​లో 95 ఇలా అన్నింటిలోనూ టాప్​ స్కోర్​ సాధించింది సమంత. తన టీచర్లు సైతం ప్రోగ్రేస్ రిపోర్ట్ మీద సామ్​ను అభినందిస్తూ కామెంట్స్​ రాశారు. ఈ ఫొటో చూసిన అభిమానులు మా సామ్​ నెంబర్​1 అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా గత కొంత కాలంగా మయోసైటిస్​ అనే ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత యశోద సినిమాను పూర్తి చేసి శాకుంతలం సినిమాతో బిజీ అయిపోయింది. ఫిబ్రవరిలో ఈ మైథలాజికల్​ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది.

సమంత మార్క్స్ మెమో

ABOUT THE AUTHOR

...view details