తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'సామజవరగమన' బాక్సాఫీస్ జోరు.. వర్కింగ్ డేస్​లోనూ వసూళ్లే వసూళ్లు! - సామజవరగమన మూవీ బాక్సాఫీస్​ కలెక్షన్స్

Samajavaragamana collections : టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు నటించిన 'సామజవరగమన' బాక్సాఫీస్ వద్ దూసుకెళ్తోంది. ఐదో రోజు కూడా మంచి వసూళ్లు అందుకుని సెన్సేషన్​ క్రియేట్​ చేస్తోంది. ఆ వివరాలు..

Samajavaragamana box office collection
Samajavaragamana day 5 collection

By

Published : Jul 4, 2023, 3:37 PM IST

Updated : Jul 4, 2023, 3:43 PM IST

Samajavaragamana collections : టాలీవుడ్ హీరోశ్రీ విష్ణు తాజాగా నటించిన సినిమా.. 'సామజవరగమన'. ఎటువంటి బజ్​ లేకుండా థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్​లో మంచి టాక్​ అందుకుని సెన్సేషన్​ క్రియేట్​ చేస్తోంది. రోజు రోజుకూ తన వసూళ్లను పెంచుకుంటూ బాక్సాఫీస్​ ముందు దూసుకుపోతోంది. క్లాస్​ స్టోరీతో.. కామెడీ ఎలిమెంట్స్​లో రూపొందిన ఈ సినిమా.. ఇప్పుడు ఫ్యామిలీ ఆడియెన్స్​ అంతా వరుసగా క్యూ కట్టేలా చేస్తోంది. తొలి రోజు వరల్డ్ వైడ్​గా రూ.2.89 కోట్ల గ్రాస్, రెండో రోజు రూ.3.42 కోట్ల వసూలు అందుకుని టాక్​ ఆఫ ద టౌన్​గా నిలుస్తోంది. ఇక మూడో రోజు ఏకంగా రూ.6.65కోట్ల గ్రాస్ కలెక్ట్​ చేసి అందర్ని ఆశ్చర్యపరిచింది. ఇక నాలుగో రోజు కూడా అదే ఊపులో రూ.3 కోట్ల గ్రాస్ అందుకుని రికార్డుకెక్కింది. అయితే నిఖిల్​ 'స్పై'తో పాటు రిలీజైన ఈ సినిమా మొదటి రోజు మోస్త‌రు ఓపెనింగ్స్​ను అందుకోగా.. ఆ తర్వాత రెండో రోజు నుంచి మౌత్ టాక్​తో కలెక్షన్స్​ ఉపందుకుని ఇప్పుడు మంచి ఫామ్​లో ఉంది.

Samajavaragamana Day 5 Collections : అయితే ఐదో రోజూ కూడా ఊహించని రేంజ్​లో కలెక్షన్స్​ అందుకుంది. ఇండియా వైడ్​గా రూ. 1.20 కోట్ల గ్రాస్, వరల్డ్​ వైడ్​గా రూ.3 కోట్ల గ్రాస్ కలెక్షన్లను కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఇక ఓవర్సీస్​లోనూ అదిరిపోయే కలెక్షన్లను అందుకుని దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు అమెరికాలో 440K డాలర్లను అందుకున్న ఈ సినిమా.. ఐదో రోజు 75K డాలర్ల వసూళ్లను అందుకుందట. మొత్తంగా ఓవర్సీస్‌లో రూ.3.6 కోట్లకుపైగా కలెక్షన్లను వసూలు చేసిందని ట్రేడ్​ వర్గాల సమాచారం.

Samajavaragamana cast : గత కొద్ది కాలంగా సరైన హిట్​ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్న టాలీవుడ్​ హీరో శ్రీ విష్ణు.. 'సామజవరగమన'తో మళ్లీ ఫామ్​లోకి వచ్చారు. జూన్​ 29న రిలీజైన ఈ చిత్రంతో ఆడియెన్స్​ ముందుకు వచ్చిన ఆయన.. ఇప్పుడు ఈ సినిమా సక్సెస్​ను అందుకుని మంచి జోష్​లో ఉన్నారు. కామెడీ ఎంటర్టైనర్​గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన యంగ్​ బ్యూటీ రెబ్బా మోనిక జాన్ హీరోయిన్​గా మెరిసింది. ఇక నరేశ్​,వెన్నెల కిశోర్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్ లాంటి స్టార్స్​ తమదైన స్టైల్​లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీకి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు.

Last Updated : Jul 4, 2023, 3:43 PM IST

ABOUT THE AUTHOR

...view details