తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సల్మాన్​కు బెదిరింపులే కాదు.. హత్యకు కుట్ర.. షాకింగ్​ విషయాలు వెలుగులోకి.. - salman khan threatening letter

సల్మాన్​ ఖాన్​కు బెదిరింపుల కేసులో ఓ షాకింగ్​ విషయం వెలుగులోకి వచ్చింది. సల్మాన్​కు కేవలం బెదిరింపులే కాదని, అతడిని చంపేందుకు కుట్ర జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో అరెస్టైన సిద్ధేశ్​ కాంబ్లే మరిన్ని షాకింగ్​ విషయాలను పోలీసు దర్యాప్తులో బయటపెట్టాడు.

సల్మాన్ ఖాన్​
salman khan

By

Published : Jun 10, 2022, 6:00 PM IST

సల్మాన్ ఖాన్​కు బెదిరింపుల వ్యవహారంలో రోజుకో షాకింగ్​ విషయం బయటకు వస్తోంది. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన సిద్ధేశ్ కాంబ్లే అలియాస్ మహాకాల్​.. ఓ సంచలన విషయాన్ని వెల్లడించాడు. సల్మాన్​కు బెదిరింపులే కాక.. అతడిని హత్య చేసేందుకు ప్రయత్నాలు జరిగినట్లు తెలిపాడు. అందుకోసం సంపత్ నెహ్రా అనే రౌడీని ముంబయికి పంపించినట్లు పేర్కొన్నాడు.

"సంపత్​ నెహ్రా.. గ్యాంగ్​స్టర్​ లారెన్స్​ బిష్ణోయ్​కి రైట్​ హ్యాండ్. సల్మాన్​ను చంపడానికి లారెన్సే అతడిని ముంబయి పంపించాడు." అని మహాకాల్​ పోలీసులకు తెలిపాడు. అనంతరం లారెన్స్​ను కూడా ప్రశ్నించారు పోలీసులు. "2021లో సల్మాన్​ను చంపేందుకు కుట్ర పన్నినట్లు లారెన్స్ తెలిపాడు. దానికోసం రాజస్థాన్​ గ్యాంగ్​స్టర్​ సంపత్​ నెహ్రాకు సుపారీ ఇచ్చినట్లు వెల్లడించాడు" అని పోలీసులు పేర్కొన్నారు.

బతికిపోయిన సల్మాన్!: "కుట్రలో భాగంలో ముంబయిలో రెక్కీ చేశాడు సంపత్. షూట్​ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అయితే సల్మాన్​ ఉన్న దూరానికి తన వద్ద ఉన్న గన్​తో కాల్పులు జరిపేందుకు వీలులేకపోవడం వల్ల అతడు బతికిపోయాడు. అనంతరం తన గ్రామానికి చెందిన ఓ జవాన్​ను సంప్రదించి.. సల్మాన్​ను కాల్చేందుకు ఓ రింగ్​ రైఫిల్​ను ఆర్డర్​ చేశాడు సంపత్. అయితే అది వచ్చేలోపే సంపత్​ను అరెస్టు చేశాం." అని పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి:'సల్మాన్​ ఖాన్​ హత్య బెదిరింపులు వారి పనే.. త్వరలోనే అరెస్ట్​ చేస్తాం'

ABOUT THE AUTHOR

...view details