Salman Khan Vishnu Vardhan : రీసెంట్గా 'కిసీ కా భాయ్ కిసీ కీ' జాన్ చిత్రంతో వచ్చి తన అభిమానులను నిరాశపరిచిన బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్.. ఇప్పుడు మరో కొత్త సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పంజా సినిమా దర్శకుడు విష్ణు వర్ధన్‌తో కలిసి పనిచేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా సాగుతున్నాయని సమాచారం అందింది.
త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించుకునేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. నవంబర్ మధ్యలో నుంచి సెట్స్‌పైకి వెళ్తుందని అంటున్నారు. ఇక అప్పటి నుంచే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందట. పాన్ ఇండియా స్థానంలో ఆర్మీ బ్యాక్ డ్రాప్ కథలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్‌ను సరికొత్త అవతారంలోనూ కనిపిస్తారని తెలుస్తోంది.
కాగా, విష్ణు వర్ధన్.. గతంలో పంజా సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను స్టైలిష్‌గా పవర్ఫుల్ లుక్‌లో సరికొత్తగా చూపించారు. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ ముందు అంతగా ఆడలేదు. కానీ పవన్ మేనరిజం, లుక్స్ అభిమానులను మాత్రం బాగా ఆకట్టుకుంది. ఇక రీసెంట్గా విష్ణు వర్ధన్.. బాలీవుడ్లో షేర్ షా చిత్రంతో సూపర్ హిట్‌ను అందుకున్నారు. కోలీవుడ్‌లోనూ పలు హిట్ సినిమాలను తెరకెక్కించి గుర్తింపు పొందారు. దీంతో ఇప్పుడు సల్మాన్‌తో చేయబోయే సినిమాపై కూడా మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.