ఓ హీరో చిత్రంలో మరి కథానాయకుడు అతిథి పాత్రలో మెరవడం మనం చూస్తునే ఉంటాం. కేవలం మెరవడం మాత్రమే మరి కొన్ని సందర్భాల్లో పాటలు పాడటం, వాయిస్ ఓవర్ అంటూ గాత్ర దానం కూడా చేస్తుంటారు. ఇదంతా సహ నటులు, దర్శకులతో ఉన్న స్నేహం, అభిమానంతోనే, సినిమాకు హైప్ పెంచాలనో ఇలా చేస్తుంటారు. అలానే ఈ ఏడాది కూడా వచ్చిన చిత్రాల్లో కొందరు స్టార్ హీరోలు మరో కథానాయకుల చిత్రాల్లో గెస్ట్ అప్పియరెన్స్‌తో మెప్పించారు. ఇంకొంతమంది అలరించేందుకు సిద్ధమయ్యారు. అయితే దీని కోసం వారు కనీసం ఒక్క రూపాయి రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదట. మరి వారెవరో చూద్దాం.
వారిసు కోసం మరోసారి.. తమిళ స్టార్ హీరో శింబు.. సింగర్ కూడా అన్న విషయం తెలిసిందే. చాలా సార్లు మరో హీరో చిత్రానికి స్పెషల్ సాంగ్స్ పాడుతుంటారు. అలా ఈ సారి మరో ప్రముఖ హీరో దళపతి విజయ్ నటిస్తున్న 'వారిసు' కోసం ఓ మాస్ సాంగ్ పాడారు. 'తీ దళపతి' పాటను ఆలపించారు. ఇటీవలే విడుదలైన ఈ పాట మాస్ ఆడియెన్స్‌ను ఉర్రూతలూగించింది. అయితే ఈ పాట పాడినందుకు ఆయన ఒక్క రూపాయి రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదని తెలిసింది. ఏమి ఆశించకుండా ఫ్రీగా పని చేశారట. హీరో విజయ్‌తో తనకున్న స్నేహంతోనే ఇలా చేశారు. కాగా, ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక నటిస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. సంక్రాంతి 12న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది.
దళపతి విజయ్.. హీరో విజయ్ కూడా బాలీవుడ్ బాద్ షా నటిస్తున్న షారుక్ ఖాన్ జవాన్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అట్లీ దర్శకుడు. అట్లీతో మంచి అనుబంధం ఉన్న నేపథ్యంలోనే ఈ పాత్ర కోసం ఆయన ఎలాంటి పారితోషికం తీసుకోవట్లేదట.