తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఆ షాట్ అద్భుతం - కత్రినాతో కలిసి చేస్తున్నందుకు నేను అదృష్టంగా ఫీల్‌ అవుతున్నాను' - టైగర్​ 3 మూవీ రిలీజ్​ డేట్

Salman Khan Tiger 3 Movie : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్​, కత్రినా కైఫ్ కాంబినేషన్​లో వస్తున్న లేెటెస్ట్ మూవీ 'టైగర్​ 3'. మనీశ్​ శర్మ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నవంబర్​ 12న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో సల్మాన్‌.. ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. అవేంటంటే..

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2023, 6:40 AM IST

Salman Khan Tiger 3 Movie : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ లీడ్​ రోల్స్​లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'టైగర్​ 3'. 'ఏక్‌ థా టైగర్‌' సినిమాతో మొదలైన ఈ స్పై యాక్షన్‌ పరంపర బాలీవుడ్‌లో తెగ ట్రెండ్​ అవుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఇదే ఫ్రాంఛైజీలో 'టైగర్‌ 3'రానుంది. మనీశ్​ శర్మ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నవంబర్​ 12న థియేటర్లలోకి రానుంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌లో టైగర్‌, జోయాల ప్రేమ, ఇండియా కోసం రా ఏజెంట్‌ అయిన టైగర్‌ చేసే యాక్షన్‌ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో సల్మాన్‌.. ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. అవేంటంటే..

  1. ఈ సినిమాలో కళ్లు చెదిరే యాక్షన్‌ సీక్వెన్స్‌లు చాలా ఉన్నాయి. ఆడియెన్స్​ ఎక్స్​పెక్టేషన్స్​కు తగ్గట్టుగా డైరెక్టర్​ మనీశ్​ వాటిని ప్లాన్‌ చేశారు. సినిమాలోని అన్ని యాక్షన్‌ సన్నివేశాల కన్నా ఓ బైక్‌ ఛేజింగ్‌ సీన్‌ మాత్రం చాలా కష్టంగా అనిపించింది(నవ్వుతూ). అయితే చేసిన అన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌ల కన్నా అది భారీ షాట్‌ అని నేను చెప్పగలను. దాన్ని ప్రేక్షకులు ఆస్వాదించాలంటే మూవీ టీమ్​కు ఎంతో ప్లానింగ్‌ ఉండాలి. దాని కోసం ఎంతో మంది సహాయ సహకారాలందించారు. ఆ షాట్‌ మాత్రం అద్భుతం.
  2. షూటింగ్​ ఎంతో సరదాగా సాగింది. టర్కీలో కెప్పడోసియాలో షూట్‌ చేసిన 'లేకే ప్రభు కా నామ్‌' పాట మరింత ఆనందం ఇచ్చింది. కత్రినాతో కలిసి చేసిన చాలా పాటలు చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఆ లిస్ట్​లో ఈ పాట తప్పక చేరుతుంది. మంచి పాటలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను కత్రినాతో కలిసి అలరిస్తున్నందుకు నేను అదృష్టంగా ఫీల్‌ అవుతున్నాను.
  3. ఈ మూవీ ఏ రేంజ్‌లో ఉంటుందో 'టైగర్‌ వర్సెస్‌ పఠాన్‌' కూడా అంతకు మించి ఉంటుంది. యాక్షన్ లవర్స్​కు సిద్ధార్థ్‌ ఆనంద్‌ ఆ సినిమాతో మంచి ట్రీట్‌ ఇవ్వనున్నారు. అందుకు తగ్గట్లుగా సన్నాహాలు కూడా చేస్తున్నారు. త్వరలోనే షూటింగ్‌ పనులు ప్రారంభమవుతాయి. ఆ సినిమా చిత్రీకరణ ఎప్పుడు మొదలైన 'ఈ టైగర్‌ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు'(నవ్వుతూ).
  4. 'టైగర్‌ 3' సినిమా కోసం సల్మాన్‌ అభిమానులే కాదు షారుక్‌, హృతిక్‌ రోషన్‌లు అతిథి పాత్రలో కనిపించనుండటం వల్ల వారి ఫ్యాన్స్‌ కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. షారుక్‌, సల్మాన్‌లు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఎలా ఉంటుందో 'పఠాన్‌' సినిమా చూపించింది. దీంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెట్టకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details