తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సల్మాన్​ ఖాన్​కు బెదిరింపులు! - చావుకు వీసా అక్కర్లేదంటూ వార్నింగ్! - సల్మాన్​ ఖాన్ సెక్యూరిటీ

Salman Khan Threat : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్​కు బెదిరింపులు వచ్చాయి. సోషల్ మీడియా పోస్ట్​ ద్వారా ఆయన్ను హెచ్చరించారు. దీంతో సల్మాన్ ఖాన్ భద్రతను మరింత పటిష్ఠం చేశారు ముంబయి పోలీసులు.

Salman Khan Threat
Salman Khan Threat

By ETV Bharat Telugu Team

Published : Nov 29, 2023, 10:40 AM IST

Updated : Nov 29, 2023, 12:02 PM IST

Salman Khan Threat :బాలీవుడ్​ స్టార్ హీరో సల్మాన్​ ఖాన్​కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఈసారి ఫేస్​బుక్​ పోస్ట్​ ద్వారా సల్మాన్​ ఖాన్​కు హెచ్చరిక వచ్చింది. దీంతో ఆయన్ను ముంబయి పోలీసులు అప్రమత్తం చేశారు.

ఇదీ జరిగింది..ఫేస్​బుక్​లో గ్యాంగ్​స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరిట ఉన్న అకౌంట్​ నుంచి.. సల్మాన్ ఖాన్​కు హెచ్చరిక వచ్చింది. ఈ అకౌంట్​కు లారెన్స్ ఫొటోనే ప్రొఫైల్​గా ఉంది. అయితే ఇది లారెన్స్ ఒరిజినల్ ఖాతానా? లేదా ఫేక్ అకౌంటా అన్న విషయం నిర్ధరణ కాలేదు.

ఈ పోస్ట్​లో పంజాబీ సింగర్ గిప్పీ గ్రేవాల్​ను ఉద్దేశిస్తూ.. "నువ్వు సల్మాన్​ ఖాన్​ను సోదరుడిగా భావిస్తావు. ఇప్పుడు నీ అన్న వచ్చి నిన్ను కాపాడవలసిన సమయం వచ్చింది. ఈ మెసేజ్​ నీకు మాత్రమే కాదు. సల్మాన్​ ఖాన్​కు కూడా. దావూద్ వచ్చి కాపాడతాడని ఊహల్లో ఉండకు. నిన్ను సేవ్ చేయడానికి ఎవరూ రారు. సిద్ధూ మూసేవాలా మరణంపై నువ్వు, ఎలా స్పందించావో మేము చూశాం. ఈ బెదిరింపు ట్రైలర్ లాంటిదే. అసలు సినిమా ముందుంది. నువ్వు ఏ దేశానికైనా వెళ్లు.. కానీ, మరణానికి వీసా అవసరం లేదు" అని ఉంది.

ఏడాదిలో రెండోసారి.. ఇదే ఏడాది మార్చ్​లో సల్మాన్​కు తొలిసారి హెచ్చరికలు పంపాడు బిష్ణోయ్. అప్పుడు సల్మాన్​కు ఈ మెయిల్​ ద్వారా హత్యా బెదిరింపులు వచ్చాయి. విదేశాల్లో మెడిసిన్ చదువుతున్న ఓ భారతీయ వ్యక్తి మెయిల్ నుంచి ఈ బెదిరింపు వచ్చినట్లు పోలీసులు కనిపెట్టారు. కాగా, తాజాగా రెండోసారి బిష్ణోయ్ గ్యాంగ్​ నుంచి వార్నింగ్ మెసేజ్ రావడం వల్ల పోలీసులు.. సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ ఏర్పాట్లను మరింత పటిష్ఠం చేశారు. అయితే ఈ పోస్ట్​ భారత్​ నుంచి కాకుండా మళ్లీ విదేశాల్లో నుంచే వచ్చినట్లు తెలుస్తోంది. ఇక డ్రగ్స్​ కేసులో లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. హీరో సల్మాన్​ను హత్య చేయడమే తన లక్ష్యం అని గతంలో ఓ ఇంటర్వ్యూలో బిష్ణోయ్ తెలిపాడు. కాగా, గతేడాది జరిగిన పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా మర్డర్ కేసులోనూ బిష్ణోయ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.

గ్యాంగ్​స్టర్​ లారెన్స్ ముఠా​ హిట్​లిస్ట్​లో కరణ్​జోహార్​!

దయచేసి ఆ మెయిల్స్‌ నమ్మొద్దు.. వారిపై కఠిన చర్యలు తప్పవు: సల్మాన్ ఖాన్​

Last Updated : Nov 29, 2023, 12:02 PM IST

ABOUT THE AUTHOR

...view details