'సల్మాన్ ఖాన్ కండలు గ్రాఫిక్సే' అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేసిన కామెంట్లపై బాలీవుడ్ హీరో సల్మాన్ స్పందించారు. తనది అసలైన సిక్స్ ప్యాక్ అంటూ షర్ట్ విప్పి చూపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సల్మాన్ ఖాన్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' సినిమా ట్రైలర్‌ను ఆయన సోమవారం విడుదల చేశారు. స్టేజ్‌పై ఉన్న సల్మాన్‌ను చూసి ఫ్యాన్స్ అందరూ గట్టిగా అరుస్తూ.. ఈలలు వేశారు. ఈ సందర్భంగా గతంలో తనపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టారు. గతంలో తనవి కండలు కాదని.. గ్రాఫిక్స్ అని కొందరు అన్నారని సల్మాన్ ప్రస్తావించారు. బ్లాక్ షర్ట్ వేసుకున్న సల్మాన్.. తన చొక్కా బటన్స్ విప్పి.. ఇది ఒరిజినల్ సిక్స్ ప్యాక్ అని చూపించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
'నా కండలు గ్రాఫిక్స్ అంటారా? ఇవిగో చూసుకోండి!'.. షర్ట్ విప్పిన సల్మాన్ ఖాన్ - కిసీ కా భాయ్ కిసీకా జాన్ సినిమా సినిమా ట్రైలర్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ విమర్శకులకు గట్టి సమాధానమిచ్చారు. తన సిక్స్ ప్యాక్ గ్రాఫిక్స్ అన్న విమర్శలకు బదులుగా.. షర్ట్ విప్పి కండలు చూపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు. 'సినిమాల్లో సల్మాన్ వీఎఫ్ఎక్స్ ఉపయోగిస్తారని అనే వాళ్లకు ఇది ఒక చెంప దెబ్బ' అని ఓ అభిమాని రాసుకొచ్చాడు. 'అది గ్రాఫిక్స్ కాదు.. నిజంగా సిక్స్‌ప్యాక్' అని మరో యూజర్ కామెంట్ చేశాడు.
'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' సినిమా విషయానికొస్తే.. సోమవారం ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈద్ సందర్భంగా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా.. ప్రచార పర్వం మొదలైంది. ఇందులో సల్మాన్ సరసన పూజా హెగ్డీ హీరోయిన్గా నటిస్తున్నారు. విక్టరీ వెంకటేశ్, జగపతిబాబు, భూమిక చావ్లా, విజేంధర్ సింగ్, అభిమన్యు సింగ్, రాఘవ్ జుయాల్, సిద్ధార్థ్ నిగం, జెస్సీ గిల్, సెహ్నాజ్ గిల్, పాలక్ తివారీ, వినాలీ భట్నాగర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
సల్మాన్‌ను చంపేస్తానన్న 16 ఏళ్ల బాలుడు..
మరోవైపు.. సల్మాన్ ఖాన్‌ను ఏప్రిల్ 30వ తేదీలోపు చంపేస్తానని బెదిరించిన నిందితుడిని.. మహారాష్ట్ర ఠాణె జిల్లాలో మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిన రాజస్థాన్‌కు చెందిన 16 ఏళ్ల బాలుడిగా గుర్తించారు. ఈ బెదిరింపు కాల్ అంత తీవ్రమైనదేమీ కాదని పోలీసులు తెలిపారు.
సోమవారం రాత్రి 9 గంటల సమయంలో సల్మాన్‌కు చంపేస్తామని మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ మేరకు నిందితుడు ముంబయి పోలీస్ కంట్రోల్ రూంకు కాల్ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. సల్మాన్ ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసి.. బెదిరింపు కాల్‌పై దర్యాప్తు చేపట్టారు.