బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ ఫ్యాన్ చేసిన ఓ సాహస యాత్ర అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఏకంగా 1,100 కిలోమీటర్లు సైకిల్ తొక్కి తన అభిమాన సల్లూ భాయ్‌ను కలిశాడు సమీర్ అనే యువకుడు.
సమీర్ స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్. గతేడాది డిసెంబర్ 27న సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా జబల్పుర్ నుంచి ఈ సైకిల్ యాత్రను మొదలు పెట్టాడు. ఏడు రోజుల పాటు సైకిల్‌పై ప్రయాణించి.. ముంబయికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న సూపర్ స్టార్ సల్మాన్.. సమీర్‌ను కలిసేందుకు ఒప్పుకున్నాడు. అతడితో సెల్ఫీలు దిగి కాసేపు ముచ్చటించాడు. తాను సల్మాన్ ఖాన్ కా దీవానా(సల్మాన్ ఖాన్ అంటే పిచ్చి) అని చెప్తున్నాడు సమీర్. కాగా, సమీర్‌తో దిగిన ఫొటోలను సల్మాన్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇప్పుడవి వైరల్ అవుతున్నాయి.