Yash Look : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'సలార్' సినిమాకు సంబంధించి ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. అదే.. 'కేజీఎఫ్' ఫేమ్ యశ్ కొత్త లుక్‌లో ఉన్న పోస్టర్. దీంతో అది 'సలార్' సినిమా టీజర్‌లోని పోస్టరేనా అంటూ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. 'కేజీఎఫ్' సిరీస్‌తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Salaar Teaser Release Date : తాజాగా విడుదలైన ఆదిపురుష్ సినిమా నెగటివ్ టాక్‌ను తెచ్చుకున్న నేపథ్యంలో సలార్ సినిమాపై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. అయితే 'సలార్' టీజర్ విడుదల తేదీని ఇప్పటికే ప్రకటించింది మూవీ యూనిట్. ఈ నెల 6న ఉదయం 5 గంటల 12 నిమిషాలకు టీజర్‌ను విడుదల చేయనున్నట్లు హోంబలే ఫిల్మ్స్ తెలిపింది. దీంతో టీజర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
అంత ఉదయమా..
Salaar Teaser Release Date And Time : 'కేజీఎఫ్'తో సూపర్ హిట్ అందుకున్నారు హీరో యశ్ దర్శకుడు ప్రశాంత్ నీల్. అయితే సలార్- కేజీఎఫ్ సినిమాలకు ఏదో లింక్ ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే దీనికి మరింత బలం చేకూర్చేలా సినిమా టీజర్ విడుదల సమయం ఉంది. అదు కూడా భారత కాలమాన ప్రకారం తెల్లవారుజామున 5:12 నిమిషాలు. 'కేజీయఫ్-2'లో రాఖీ భాయ్ చనిపోయినట్లు చూపించే సన్నివేశంలో ఉన్న గడియారంలో ఉన్న సమయం కూడా ఉదయం 5:12 నిమిషాలే. దాన్ని స్క్రీన్ షాట్స్ తీసి తెగ ట్రెండ్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు. ఇక ఈ ట్రోలింగ్‌లకు చెక్ పడాలంటే జులై 6న సలార్ టీజర్ రిలీజ్ అయ్యేంత వరకు వేచి చూడాల్సిందే.
పప్పులో కాలేశారు..
ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యశ్ కొత్త లుక్ ఫొటోలు 'సలార్' టీజర్ లోనివి కాదని స్పష్టంగా తెలుస్తోంది. అది ఓ కంపెనీకి చెందిన యాడ్ వీడియో. ఇందులో యశ్ కౌబాయ్ గెటప్‌లో కనిపిస్తూ.. చేతిలో బియర్డ్ ఆయిల్ పట్టుకుని ప్రమోషన్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోతో పాటు ఓ పోస్టర్‌ను విడుదల చేసింది సదరు సంస్థ. ఆ వీడియోలోని ఫొటోలను స్క్రీన్ షాట్ తీసి సలార్ సినిమాకు లింక్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కొందరు ఆకతాయిలు. దీంతో అది కాస్త వైరల్‌గా మారింది. వాటిని చూసిన ప్రభాస్ అభిమానులు అది నిజంగానే సలార్ టీజర్‌లోని పోస్టర్ అని అనుకున్నారు.