Salaar vs Dunki :గత కొన్ని రోజులుగా నెట్టింట 'సలార్' సినిమా రిలీజ్ డేట్ గురించి చర్చలు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో విడుదలవ్వాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడి.. ఎట్టకేలకు డిసెంబర్లో విడుదల కానుందంటూ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అయితే అదే సమయంలో షారుక్ ఖాన్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న 'డంకీ' మూవీ కూడా రిలీజయ్యేందుకు సన్నాహకాలు జరిగాయి. వాస్తవానికి షారుక్.. ఈ సినిమా క్రిస్మస్ లేదా న్యూ ఇయర్‌కు థియేటర్లలో రానుందంటూ చెప్పారు. అయితే అఫీషియల్ డేట్‌ను మాత్రం చెప్పలేదు. ఆ తర్వాతనే 'సలార్' సినిమా రిలీజ్ డేట్‌ను మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో నెట్టింట ఫ్యాన్ వార్ మొదలైంది.
రెండు సినిమాలు ఒకే నెలలో రిలీజైతే ఏదో ఒక సినిమా భారీగా దెబ్బతినే అవకాశాలున్నాయంటూ అటు ప్రభాస్‌తో పాటు ఇటు షారుక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో డిస్కషన్ పెట్టడం మొదలెట్టారు. అయితే ఈ విషయంపై అటు 'సలార్' ఇటు 'డంకీ' మేకర్స్ ఏ మేరకు స్పందించలేదు. దీంతో ఈ రెండు సినిమాలు కచ్చితంగా క్లాష్ అవుతాయని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ ట్రెండ్ అవుతోంది. దీని ప్రకారం 'డంకీ' వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
Dunki Movie Release Date : తాజా సమాచారం ప్రకారం 'డంకీ'ని వాయిదా వేసే అవకాశం ఉందట. ఈ విషయాన్ని మేకర్స్ త్వరలో అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారట. దీని పలువురు సినీ విశ్లేషకులు సైతం ట్వీట్స్ చేశారు. అయితే 'డంకీ' చిత్ర బృందం ఇప్పటివరకు స్పందించలేదు. దీంతో ఫ్యాన్స్ కన్ఫ్యూజన్లో పడిపోయారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంతవరకు వెయిట్ చేద్దామంటూ కామెంట్లు పెడుతున్నారు.