Salaar vs Aquaman2 : రెబల్ స్టార్ ప్రభాస్ - డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'సలార్' డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు పోటీగా షారుఖ్ ఖాన్ 'డంకీ' కూడా అదే రోజు పోటీగా రంగంలోకి దిగనుంది. అయితే ఈ రెండూ పెద్ద ప్రాజెక్ట్‌లే అయినందున ఓపెనింగ్స్ కూడా భారీగానే వస్తాయని ట్రేడ్ వర్గాల అంచనా. దానికి తోడు దర్శకులు ప్రశాంత్ నీల్, రాజ్ కుమార్ హిరానీలు తమ సినిమాలకు కావాల్సినంత బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేశారు. ఈ క్రమంలో ఇంత హైప్ ఉన్న సినిమాలకు ఓవర్సీస్లోనూ మంచి డిమాండే ఉంది. ఇలా ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉండగా.. వాటికి చెక్ పెట్టేందుకు బాక్సాఫీస్ ముందుకు మరో సినిమా రానుంది. అయితే హాలీవుడ్ మూవీ 'ఆక్వామన్-2'.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంకు హాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది. అయితే డిసెంబర్ 20న విడుదల కావాల్సిన ఈ సినిమా.. తాజాగా రిలీజ్ డేట్‌ను మార్చుకుని డిసెంబర్ 22న రానుంది. దీంతో మన సినిమాలకు పెద్ద సమస్య ఎదురైంది. అదే రోజు 'సలార్', 'డంకీ' రానున్నందున ఈ సినిమాల యూఎస్ డిస్ట్రిబ్యూటర్లకు తలనొప్పిగా మారింది.
'ఆక్వామన్- 2'కి భారత్‌లో మినహాయిస్తే విదేశాల్లో చాలా క్రేజ్ ఉంది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ఈ హాలీవుడ్ మూవీకే తొలి ప్రాధాన్యం ఇస్తారు. 'డంకీ' యూఎస్‌లో ఒక రోజు ముందే రావటం వల్ల కొంచెం సేఫ్ అని చెప్పోచ్చు. కానీ 'సలార్'కి మాత్రం పెద్ద సమస్యే. ఈ సినిమాలు రిలీజ్ అయ్యే వరకు కూడా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే.