Salaar USA Premiere Openings :సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూసిన సలార్ చిత్రం భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చేసింది. అనేక సెంటర్లలో అర్ధరాత్రే షోస్ పడిపోవడంతో తెల్లారేసరికి సలార్ టాక్ బయటకొచ్చేసింది. ప్రస్తుతం అంతటా పాజిటివ్ టాక్‌తో ఈ సినిమా దూసుకెళ్తోంది.
ప్రభాస్ నుంచి వచ్చే మాములు సినిమానే ఓపెనింగ్స్ బాక్సాఫీస్ వద్ద కొత్త బెంచ్ మార్క్‌ను సెట్ చేస్తుంది. అలాంటిది ప్రశాంత్ నీల్‌తో చేసిన సినిమా అంటే బాక్సాఫీస్ ర్యాంపేజ్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇండియాలోనే కాదు ఓవర్సీస్లోనూ కూడా సలార్ హవా పీక్స్‌లో ఉంది. ప్రీబుకింగ్స్‌లో కొత్త రికార్డును క్రియేట్ చేస్తున్న ప్రభాస్ ఆరేళ్ల రికార్డును బ్రేక్ చేశారు.
అమెరికా మార్కెట్లో పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి సినిమా ప్రీమియర్స్ నుంచి 1.52 మిలియన్ డాలర్స్‌ను వసూలు చేసింది. మాటలమాంత్రికుడు తివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమాపై అప్పట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో అజ్ఞాతవాసి సినిమా ఫెయిల్ అయ్యింది. కానీ ఓపెనింగ్స్ మాత్రం భారీగా వచ్చాయి.
అయితే యూఎస్ ప్రీమియర్స్ విషయంలో అజ్ఞాతవాసి సెట్ చేసిన బెంచ్ మార్క్‌ను బ్రేక్ చేయడానికి చాలా సినిమాలు ట్రై చేశాయి కానీ వర్కౌట్ అవ్వలేదు. ఈసారి మాత్రం ప్రభాస్ ఆ రికార్డును అసలు మిస్ చేయలేదు. ఓవర్సీస్ మార్కెట్లో యుఎస్ రీజన్లో ప్రీమియర్స్‌తోనే ప్రభాస్ 2 మిలియన్ మార్క్‌ను టచ్ చేశారు.