Salaar Trailer Views In 24 Hours :రెబల్ స్టార్ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రానున్న సినిమా 'సలార్ పార్ట్ 1- సీజ్‌ఫైర్'. ఎన్నో అంచనాలతో పాన్ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ను.. చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. హీరో ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్, వైలన్స్ ట్రైలర్లో చూపించారు. దీంతో ట్రైలర్.. యూట్యూబ్‌లో మాస్ ర్యాంపేజ్ క్రియేట్ చేస్తోంది.
తాజాగా ఈ ట్రైలర్.. అన్ని భాషల్లో (తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ) కలిపి 24 గంటల్లోనే ఏకంగా 116+ మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డు కొట్టింది. దీంతో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ పొందిన భారతీయ సినిమాగా నిలిచింది. ఇక హిందీలో 54.3 మిలియన్ మార్క్ దాటేసింది. ఈ క్రమంలో బాలీవుడ్లో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్‌గా 'సలార్' రికార్డు క్రియేట్ చేసింది. ఇదివరకు ఆదిపురుష్ (52.3 మిలియన్) టాప్‌లో ఉంది. కాగా, ప్రస్తుతం సలార్ ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఇక తెలుగులోనూ సలార్ 33 మిలియన్ల వ్యూస్ సాధించి.. చరిత్ర సృష్టించింది.
ఏయే భాషల్లో ఎన్ని వ్యూస్ అంటే..
- హిందీలో - 54.3 మిలియన్ వ్యూస్, 850k లైక్స్
- తెలుగులో - 32.6 మిలియన్ వ్యూస్, 1.24 M లైక్స్
- కన్నడలో - 9.6 మిలియన్ వ్యూస్, 215k లైక్స్
- తమిళంలో - 9.1 మిలియన్ వ్యూస్, 226k లైక్స్
- మలయాళంలో - 7.7 మిలియన్ వ్యూస్, 212k లైక్స్