Salaar Trailer Update : : రెబల్ స్టార్ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో భారీ బడ్జెట్‌తో 'సలార్' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు సినిమా విడుదల వాయిదా పడింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. అయితే ఈ సినిమా ట్రైలర్ గురించి.. డార్లింగ్స్ ఫ్యాన్స్‌కు ఫుల్కిక్ ఇచ్చే అప్డేట్ వచ్చింది.
సలార్ ట్రైలర్‌ను డిసెంబర్ 1న విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తున్నట్లు.. బాలీవుడ్ క్రిటిక్, ట్రేడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్ష్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో వెల్లడించారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. ఈ ట్వీట్‌ను తెగ వైరల్ చేస్తున్నారు. అయితే తరణ్ ఆదర్ష్.. రిలీజ్ డేట్ గురించి చెప్పినప్పటికీ..మూవీటీమ్ నుంచి మాత్రం అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
ఈగర్లీ వెయిటింగ్ ..
ట్రైలర్ గురించి సినీ క్రిటిక్ ఇచ్చిన అప్డేట్ను సినిమా సన్నిహిత వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. కాగా, ఇప్పటివరకు మూవీ నుంచి స్టిల్స్, చిన్నపాటి గ్లింప్స్ వీడియోను మాత్రమే రిలీజ్ చేశారు. ఇక మరో మూడు వారాల్లో 'సలార్' ట్రైలర్ విడుదల కానుండంటంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ట్రైలర్ వస్తే.. డైనోసార్ లాంటి పవర్ ఫుల్ పాత్రలో ప్రభాస్ యాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
బ్యాక్ టు హైదరాబాద్..
క్రిస్మస్ కానుకగా 'సలార్'ను డిసెంబర్ 22న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మూవీటీమ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. కాగా, గతకొన్ని రోజులుగా యూరప్ ట్రిప్‌లో ఉన్న ప్రభాస్ బుధవారం హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. డార్లింగ్ కమ్ బ్యాక్‌తో సినిమా ప్రమోషన్స్ కూడా త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే 'సలార్' సినిమాలో ప్రభాస్‌కు జోడీగా శృతి హాసన్ నటించారు.