Salaar Trailer Telugu Release:Salaar Trailer Telugu : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రతిష్టాత్మక చిత్రం 'సలార్ పార్ట్ 1- సీజ్‌ఫైర్'. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. హీరో ఎలివేషన్, యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఇలా ప్రతిదీ దర్శకుడు ప్రశాంత్ నీల్ మార్క్‌కు తగ్గట్లు ఉంది. 3 నిమిషాల 47 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది. ప్రభాస్, పృథ్వీరాజ్ పాత్రకు సంబంధించి బాల్య సన్నివేశాలతో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. విడుదలైన 15 నిమిషాల్లోనే 17 లక్షల వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం. అంటే నిమిషానికి లక్షమందికిపైనే ఈ ట్రైలర్‌ను వీక్షించారు.
Salaar Story In Telugu :బద్ధ శత్రువులుగా మారే ఇద్దరు స్నేహితుల కథాంశంతో 'సలార్' రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. శ్రుతిహాసన్ కథానాయిక. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. 'సలార్'.. 'కేజీయఫ్' యూనివర్స్‌లోకి వస్తుందనే రూమర్స్‌పై ప్రశాంత్ నీల్ ఇటీవల స్పందించారు. రెండింటికీ సంబంధం ఉండదని స్పష్టం చేశారు. ఇప్పటికే విడుదలకావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది.
ఇక సలార్ సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రం కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పాన్‌ఇండియా స్థాయిలో రానున్న ఈ సినిమాపై యంగ్ రెబల్ స్టార్ అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీలో భారీ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని గతంలో చిత్ర యూనిట్ చెప్పింది. ఈ సినిమా పతాక సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని. కచ్చితంగా అవి ఒక బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేస్తాయని చెప్పారని టాక్.