Salaar Trailer Release Date : టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, కేజీయెఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'సలార్'. భారీ అంచనాల నడుమ ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో డిసెంబర్ 22న విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్, ఫస్ట్ సింగిల్‌తో ఈ సినిమా సూపర్ క్రేజ్ సంపాదించుకోగా, తాజాగా మూవీ టీమ్ మరో సాలిడ్ ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ రేపు (డిసెంబర్ 17) రిలీజ్ కానుందని సమాచారం. అయితే ఈ విషయంపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. అయితే ఫస్ట్ ట్రైలర్‌లో దేవ (ప్రభాస్), వరదరాజ మన్నార్ (పృథ్విరాజ్ సుకుమారన్) మధ్య స్నేహం గురించి ఎక్కువగా చూపించారు. దీంతో రానున్న ట్రైలర్‌లో ఎక్కువ భాగం యాక్షన్ సీక్వెన్సులు ఉండనున్నాయని తెలుస్తోంది.
Salaar Movie Cast :ఇక సలార్ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కోలీవుడ్ బ్యూటీ శ్రుతి హాసన్ నటిస్తుండగా కీలక పాత్రల్లో పృథ్విరాజ్ సుకుమారన్, బాబీ సింహా, జగపతిబాబు, టిన్నూ ఆనంద్, ఈశ్వరి రావు, శ్రియారెడ్డి, రామచంద్ర రాజు లాంటి స్టార్స్ నటించారు. ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చారు. హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.