Salaar Ticket Price Hike: పాన్ఇండియా స్టార్ ప్రభాస్ 'సలార్' మూవీకి టికెట్ రేట్స్ పెరగనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ 'మైత్రి మూవీ మేకర్స్', టికెట్ రేట్స్ పెంచుకునేందుకు, అదనపు షోస్ అనుమతి కోసం తెలంగాణ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసిందట. తొలి రోజు 6 షోస్‌లో సినిమా ప్రదర్శించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్‌లో ఒక్కో టికెట్‌పై రూ. 100 పెరగనున్నట్లు తెలుస్తోంది.
ఈ లెక్కన ఒక్కో టికెట్‌కు సింగిల్ స్క్రీన్‌లో రూ. 296, మల్టీప్లెక్స్‌ల్లో రూ. 413 (+ ప్లాట్‌ఫామ్ ఛార్జిలు అదనం). ఇక రిలీజ్ రోజు (డిసెంబర్ 22న) ప్రత్యేకంగా ఎంపిక చేసిన థియేటర్లలో అర్ధరాత్రి ఒంటిగంట (1.00 AM)కు, మిగతా అన్ని థియేటర్లలో ఉదయం 4 గంటలకు ఫస్ట్ షో పడనుంది. అయితే రేట్ల పెరుగుదలకు సంబంధించి ప్రభుత్వం నుంచి రిప్లై వచ్చిన తర్వాతే టికెట్ల అమ్మకం ప్రారంభం కానుంది.
Salaar Overseas Advance Bookings : ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్లోనూ సలార్ రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. యూఎస్ఏ ప్రీమియర్స్ షో ఇప్పటికే 7 లక్షల డాలర్లు (సుమారు రూ. 5.7 కోట్లు) కలెక్షన్లు వసూల్ అయ్యాయి. దాదాపు 25000+ టికెట్లు అమ్మడయ్యాయట. ఇక యూకేలో రూ. 1.2 కోట్లు, ఆస్ట్రేలియాలో రూ. 72 లక్షల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.