Salaar Teaser : వరల్డ్ వైడ్‌గా రెబెల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రోజు వచ్చింది. యాక్షన్ థ్రిల్లర్ 'సలార్' మూవీ టీజర్ విడుదలైంది. 'కేజీయఫ్' సిరీస్‌ను తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్‌నీల్- ప్రొడక్షన్ హౌస్ హోంబలే ఫిల్మ్సే.. దీనిని కూడా రూపొందించారు.
తాజాగా ఈ ఉదయం(జులై 6) 5.12 గంటలకు టీజర్‌ను రిలీజ్ చేశారు. సినీ అభిమానుందరూ ఊహించినట్టే.. ఈ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలున్నాయని ప్రచార చిత్రంలో చూపించారు. ఇంకా ఈ టీజర్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ మార్క్ టేకింగ్ బాగా కనిపడింది. కేజీయఫ్‌లో రాఖీ భాయ్ ఎలివేషన్స్ ఎలా ఉన్నాయో.. ఈ సారి అంతకన్నా ఎక్కువగా ప్రభాస్ ఎలివేషన్స్ చూపించారని అర్థమవుతోంది. పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు, కోల్ మైనింగ్ ప్రాంతంలో బ్లాక్ అండ్ వైట్ బ్యాక్ గ్రౌండ్ విజువల్స్‌లో ప్రభాస్ భారీ కటౌట్‌ను అదిరిపోయేలా చూపించారు. అయితే ఇక్కడ మరో విషయంలో ప్రభాస్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదేంటంటే ప్రభాస్‌ను కత్తి పట్టుకొని ప్రతినాయకులపై విరుచుకుపడుతున్నట్లుగా చూపించారు కానీ.. ఆయన ముఖాన్ని మాత్రం చూపించలేదు. దీంతో ఫ్యాన్స్ కాస్త హర్ట్ అయ్యారు. మొహం చూపించి ఉంటే ఇంకా బాగుండేదని తెగ కామెంట్లు పెడుతున్నారు. ఇకపోతే చిత్రంలో సీనియర్ నటుడు టీనూ చెప్పిన 'జురాసిక్ పార్క్' డైలాగ్ ఆధారంగా ప్రభాస్ పాత్ర బాగా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. అంటే ప్రభాస్ పాత్ర డైనోసార్ తరహాలో ఎంతో బలంగా, క్రూరంగా(వైలెన్స్) ఉంటుందనమాట.