Salaar Promotion :పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గ్యాంగ్ స్టర్ సినిమా 'సలార్'. మరో 27 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్నా మూవీటీమ్ టీమ్ మాత్రం ఎటువంటి ప్రమోషన్స్ చేయకుండా సైలెంట్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కు నిరాశ కలిగిస్తోంది!
అయితే తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. సలార్ మేకర్స్ ఓ డేరింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలిసింది. ఈ సినిమాకు ఎటువంటి ప్రమోషన్స్ చేయకూడదని ఫిక్స్ అయ్యారట. ఈవెంట్లు కూడా నిర్వహించరని సమాచారం అందింది. సినిమా విడుదల సమయంలోపు కేవలం ఓ ట్రైలర్‌ను, ఆ తర్వాత ఒకటి లేదా రెండు పాటలను మాత్రమే విడుదల చేస్తారని తెలిసింది. అయితే ఇలా చేయడానికి కారణం కాన్ఫిడెన్స్ అని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ భారీ స్థాయిలో విశేష స్పందన అందుకున్న సంగతి తెలిసిందే. సినిమా పక్కా హిట్ అన్న టాక్ కూడా వినిపిస్తోంది.
అలాగే ప్రభాస్‌తో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాతలు కూడా.. తమ సినిమా ఔట్‌పుట్‌పై అంతే భారీ నమ్మకంతో ఉన్నారట. ఉన్నారట. సినిమా హిట్ అవ్వడం గ్యారంటీ అన్న ధీమాతో ఉన్నారని తెలిసింది. అందుకే ఎటువంటి ప్రమోషన్స్, ఈవెంట్లు లేకుండానే సినిమాను డైరెక్ట్ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారని టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని దక్కించుకుంటుందో..