తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Salaar Postponed : యూఎస్​లో టెన్షన్​ టెన్షన్​.. టికెట్​ డబ్బులు రీఫండ్​! - సలార్ టికెట్స్ రీఫెండ్

Salaar Postponed : సోషల్​ మీడియాలో ఎక్కడ చూసిన సలార్​ వాయిదా ప్రచారమే కనిపిస్తోంది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఓవర్సీస్​లో థియేటర్ల నుంచి సలార్​ షోస్​కు సంబంధించిన వివరాలను తీసేస్తున్నారట. టికెట్​ బుకింగ్స్ డబ్బులను కూడా రీఫండ్ చేస్తున్నారని తెలిసింది.

Salaar Postponed : యూఎస్​లో టెన్షన్​ టెన్షన్​.. టికెట్​ డబ్బులు రీఫండ్​!
Salaar Postponed : యూఎస్​లో టెన్షన్​ టెన్షన్​.. టికెట్​ డబ్బులు రీఫండ్​!

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2023, 2:54 PM IST

Salaar Postponed : భారీ స్థాయిలో ఊహించని రేంజ్​లో అంచనాలు పెంచి.. రిలీజ్​ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తి కలిగించిన ​ సలార్.. ఇప్పుడు షాక్​కు గురి చేసింది. ఈ సినిమా విడుదల వాయిదా అని నిన్నటి నుంచి ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్​పోన్​ గురించి ఇప్పటికైతే ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పోస్ట్​పోన్​ కన్ఫామ్​ అని అర్థమైపోతోంది.

Salaar Overseas Bookings : ఇప్పటికే ఈ భారీ యాక్షన్​ సినిమా కోసం.. ఓవర్సీస్​లో హైరేంజ్​లో బుకింగ్స్​ జరుగుతున్న సంగతి తెలిసిందే. యూఎస్​ బాక్సాఫీస్ ముందు అయితే ఇప్పటికే ఊహించని స్థాయిలో ప్రీ సేల్స్​ అవుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 19 వేల టికెట్లకు పైగా అమ్ముడుపోయినట్లు, హాఫ్ మిలియన్​కు పైగా కలెక్షన్స్​ వచ్చినట్లు కథనాలు కూడా వచ్చాయి.

కానీ ఇప్పుడు.. ఈ వాయిదా ప్రచారం ఎక్కువ అయిపోవడంతో ఫ్యాన్స్​కు, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్​కు పెద్ద షాక్ తగిలినట్టైది. యూఎస్​లోని థియేటర్స్​ తమ వెబ్​సైట్ల నుంచి షోలకు సంబంధించిన వివరాలను తొలిగించేస్తుందని తెలుస్తోంది. రిఫండ్ ప్రాసెస్​ కూడా ప్రారంభమైనట్లు సమాచారం అందింది.

Salaar Release Date : ఇక సలార్​ మేకర్స్​.. కొత్త రిలీజ్ ​డేట్​ కోసం కసరత్తులు చేస్తున్నారని తెలుస్తోంది. సినిమాను వీలైనంత త్వరగా అభిమానుల ముందుకు తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారట. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12కు థియేటర్లలో రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్​ జాతరే. ఎందుకంటే అప్పుడే కమల్​హాసన్ ఇండియన్ 2, మహేశ్​ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామి రంగ సహా పలు చిత్రాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. ఇకపోతే సలార్​ సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలు అంచనాలకు మించి ఉంటాయని నిర్మాతలు గతంలోనే చెప్పిన సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ నటించింది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్​, జగపతిబాబు విలన్ పాత్రల్లో నటించారు.

ABOUT THE AUTHOR

...view details