Salaar Postponed : ప్రభాస్ 'సలార్' సెప్టెంబర్ 28 నుంచి పోస్ట్ పోన్ అవ్వడం వల్ల ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ఇతర చిత్రాల విడుదల తేదీలన్నీ తారుమరైపోయాయి. దాదాపుగా చాలా సినిమాలు తన విడుదల తేదీలను మార్చుకుని కొత్త రిలీజ్ డేట్స్ను ఖరారు చేసుకునేందుకు తలమునకలైపోతున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యంగా సెప్టెంబర్ 28 తేదీ లాంగ్ వీకెండ్పై కర్చీఫ్ వేయడం కోసం పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే పలు సినిమాలు.. ఆ డేట్ను కన్ఫామ్ను చేసుకోగా.. మరికొన్ని ఆ రిలీజ్ డేట్ను ఓకే చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
Tollywood September Release Movies 2023 : ఎక్కువగా సెప్టెంబర్ రెండో వారం 15న రిలీజ్ డేట్ను ఖరారు చేసుకున్న చిత్రాలు సెప్టెంబర్ లాస్ట్ వీకెండ్కు వెళ్లిపోయాయి. దీంతో సెప్టెంబర్ 28న బాక్సాఫీస్ పోరు రసవత్తరంగా మారునుంది. చిన్న, పెద్ద.. అన్ని చిత్రాలు వచ్చేందుకు సిద్ధమైపోతున్నాయి. ఇదే క్రమంలో మళ్లీ కొన్ని చిన్న చిత్రాలు.. ఈ పోటీ వల్ల లేనిపోని నష్టాన్ని ఎందుకు తెచ్చుకోవడమనే ఆలోచనతో.. సెప్టెంబర్ 28 రేసు నుంచి కూడా తప్పుకుంటున్నాయి.
ఇప్పటికే సితార్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్రో తెరకెక్కిన ఎన్టీఆర్ బావమరిది మ్యాడ్ సినిమా విడుదల తేదీని మార్చేసుకుంది. కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ కూడా అక్టోబర్ 6కు వాయిదా వేసుకుంది. దీంతో ప్రస్తుతం సెప్టెంబర్ 28, 29 తేదీల్లో శ్రీకాంత్ అడ్డాల పెద్దకాపు 1, బోయపాటి-రామ్ పోతినేని స్కంద విడుదలయ్యేందుకు రెడీగా ఉన్నాయి. ఇంకా ఈ 28వ తేదీన రాఘవ లారెన్స్ చంద్రముఖి 2, కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ కొత్త చిత్రం ది వ్యాక్సిన్ వార్ చిత్రాలు రానున్నాయి.