Salaar Postponed : పాన్ఇండియా స్టార్ ప్రభాస్- ప్రశాంత్ నీల్ లీర్ కాంబినేషన్లో రూపొందుతున్న 'సలార్' సినిమా గురించే ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. సెప్టెంబర్ 28న గ్రాండ్‌గా రిలీజ్ అవుతుందని అందరూ భావించినప్పటికీ.. పలు కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడిందంటూ నెట్టింట పలు వార్తలు హల్చల్ చేశాయి.
ఇక ఈ వార్తలు నిజమే అన్నట్లు హొంబాలే ఫిల్మ్స్ తాజాగా ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. కొన్ని కారణాల వల్ల అనుకున్న సమయానికి 'సలార్' విడుదల చేయలేకపోతున్నట్లు తెలిపింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది.
"సలార్ పై మీరంతా చూపుతున్న అభిమానానికి ఎంతో ఆనందంగా ఉంది. కొన్ని కారణాల వల్ల మేము ఈ సినిమాను సెప్టెంబర్ 28న విడుదల చేయలేకపోతున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. మీకు మంచి సినిమాను అందివ్వడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. మీకోసం మా టీమ్ అంతా అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు తుది మెరుగులు దిద్దుతున్నాం. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం" అని హోంబలే ఫిల్మ్స్ ట్వీట్ చేసింది.
Salaar OTT : సినిమా రిలీజ్ గురించి క్లారిటీ రాకుండానే 'సలార్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందట. అయితే తెలుగు, తమిళ, కన్నడ భాషల ఓటీటీ రైట్స్‌ను మాత్రమే ఈ సంస్థ కొనుగోలు చేసినట్లు సమాచారం. సుమారు రూ.170కోట్ల నుంచి రూ.200 కోట్ల మధ్య ఈ రైట్స్ కోసం డీల్ జరిగిందట.
Prabhas Salaar Cast : ఇక 'సలార్' సినిమా విషయానికి వస్తే.. 'కేజీయఫ్ 2' తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌తో పాటు శ్రుతి హాసన్ నటిస్తున్నారు. జర్నలిస్ట్ ఆద్య అనే పాత్రలో ఆమె మెరవనున్నారు. అంతే కాకుండా ఈశ్వరీ రావు, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, రాజ టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు, 'పొగరు' ఫేమ్ శ్రియా రెడ్డి, కన్నడ నటుడు మధు గురుస్వామి కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు. భువన గౌడ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్‌గా బాధ్యతలు చేపట్టారు.
Prabhas Role in Salaar : 1000 మందితో ప్రభాస్ ఫైట్.. ఒక్కరు కాదు ఇద్దరు..
Prabhas Line Up Movie : ప్రభాస్ భారీ ప్రాజెక్ట్స్ లైనప్.. ఫుల్ కన్ఫ్యూజన్ భయ్యా!