Salaar Part 2 Release: పాన్ఇండియా స్టార్ ప్రభాస్ 'సలార్'తో బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ప్రభాస్ హీరోయిజాన్ని, యాక్షన్, ఎలివేషన్స్ సీన్స్‌ను ఫ్యాన్స్ థియేటర్లలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే వరల్డ్‌వైడ్‌గా రూ.625 కోట్లు క్రాస్ చేసింది. ఇక 'సలార్ సీజ్ఫైర్' చూసిన ఫ్యాన్స్ అందరూ రెండో పార్ట్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌లో ఒకరైన విజయ్ కిరగందుర్ సలార్ రెండో పార్ట్‌పై రీసెంట్గా ఓ క్లారిటీ ఇచ్చారు.
'డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాలోని అన్ని పాత్రలపై ఫస్ట్ పార్ట్‌లో ఓ క్లారిటీ ఇచ్చారు. స్టోరీ ఏంటి అనేది ప్రేక్షకులకు ఓ అంచనా వచ్చేసింది. ఇక పార్ట్- 2 హాలీవుడ్ సినిమా 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'లాగా ఉండనుంది. తొలి భాగానికి మించి రెండో పార్ట్‌లో యాక్షన్, డ్రామా, పాలిటిక్స్ ఉంటాయి' అని విజయ్ అన్నారు. ఈ సినిమా 2025 సెకండ్ హాఫ్‌లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 'శౌర్యంగ పర్వం' అనే టైటిల్‌తో రెండో పార్ట్ రానున్నట్లు మూవీమేకర్స్ ఇప్పటికే తెలిపారు.
Salaar Part- 2 Story: ఇద్దరి మిత్రుల మధ్య స్నేహం, పగ సలార్ పార్ట్- 1లో సరిగా చూపించలేదు. జగపతిబాబు క్యారెక్టర్‌ను కూడా తొలి భాగంలో ఎలివేట్ చేయలేదు. దీన్ని బట్టి చూస్తే, ప్రాణ స్నేహితులు ఎందుకు శత్రువులుగా మారారు? హీరోకు శౌర్యంగ తెగతో ఏం సంబంధం? చివరకు ఖాన్సార్ ఎవరు దక్కించుకున్నారు? స్టోరీలో శ్రుతిహాసన్ పాత్ర ఏమిటి? ఇలా అనేక ప్రశ్నలకు రెండో పార్ట్‌లో సమాధానం దొరకనుంది. ఇక పార్ట్- 2 షూటింగ్ త్వరలోనే పట్టాలెక్కనుందని హీరో ప్రభాస్ రీసెంట్గా ఓ సందర్భంలో తెలిపారు.