Salaar Overseas Rights :పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ 'సలార్' అనుకోని కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమా రికార్డ్ రేంజ్లో ఓవర్సీస్ బిజినెస్ చేసినట్లు సమాచారం అందింది.
గతంలో ఉత్తర అమెరికాలో ఆర్ఆర్ఆర్ మూవీ రైట్స్ రూ.40కోట్ల వరకు అమ్ముడుపోయాయి. ఇప్పటి వరకు ఓ తెలుగు సినిమాకు అక్కడ ఆ రేంజ్లో బిజినెస్ అవ్వడం అదే మొదటి సారి. ఇప్పుడు సలార్ దాదాపుగా ఆ నెంబర్‌కు దగ్గరగా వెళ్లింది. 4.5 మిలియన్ డాలర్లు. అంటే రూ.37 కోట్లకు అమ్ముడుపోయిందని తెలిసింది. దీంతో నార్త్ అమెరికాలో RRR తర్వాత సెకండ్ లార్జెస్ట్ డీల్‌గా రికార్డుకెక్కింది. అంటే ఈ లెక్క ప్రకారం చూస్తే.. అన్నీ రకాల ఖర్చులు కలిపి సలార్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9 నుంచి 10 మిలియన్ డాలర్స్ ఉంటుంది.
అయితే ప్రభాస్.. బాహుబలి 2 తర్వాత మూడు చిత్రాల్లో నటించారు. అవి బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఆ మూడు చిత్రాలు వేరు వేరుగా ఉత్తర అమెరికాలో ఫుల్ రన్ టైమ్‌లో దాదాపు 3 మిలియన్ డాలర్ల మార్క్‌ను టచ్ చేశాయి. ఆదిపురుష్ 3.1 మిలియన్ డాలర్స్, రాధేశ్యామ్ 2.2 మిలియన్ డాలర్స్, సాహో 3.3 మిలియన్స్ డాలర్స్ వరకు వసూళ్లను అందుకున్నాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. వీటిని పరిగణలోకి తీసుుకుంటే ప్రభాస్ ఈ సారి 10 మిలియన్ డాలర్స్ మార్క్‌ను టచ్ చేస్తారా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్.