Salaar OTT Rights Price : ప్రశాంత్ నీల్ - ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'సలార్'. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో వచ్చినా.. క్షణాల్లో అది వైరల్‌గా మారుతోంది. ఈ క్రమంలో తాజాగా 'సలార్'కు సంబంధించి ఓటీటీ హక్కుల విషయంలో ఓ వార్త నెట్టింట ట్రెండ్ అవుతోంది. అదేంటంటే.. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ 'సలార్' ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ఏకంగా రూ.160 కోట్లకు దక్కించుకుందట. మూవీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్.. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌తో దీనికి సంబంధించిన డీల్‌ను కూడా కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎటువంటి అఫీషియల్ అప్డేట్స్ రాలేదు.
Prabhas Movies List : మరోవైపు 'బాహుబలి 2' విజయం తర్వాత వచ్చిన 'సాహో', 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' బాక్సాపీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయాయి. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. 'సలార్'పైనే పూర్తి ఆశలు పెట్టుకున్నారు. ఇటీవలే విడుదలైన పోస్టర్, టీజర్ కూడా అభిమానుల్లో సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి. దీంతో ఈ సినిమా కోసం అటు ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే 'బాహుబలి 2' సినిమాతో ప్రభాస్ ఆ రేంజ్లో క్రేజ్ సంపాదించుకున్నారు.