Salaar Opening Day Collection Worldwide :పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. తొలి ఆట నుంచే వసూళ్ల వేట ప్రారంభించింది. కేజీఎఫ్ తర్వాత ఏర్పడిన భారీ అంచనాల మధ్య ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా అంతకు మించి వసూళ్లను రాబట్టింది.
Salaar Day 1 Collection Worldwide : తాజాగా సలార్ ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు కలెక్షన్స్ రూ.175 కోట్లు అని సినీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ. 90 కోట్లకు పైగా వసూలు చేసిందని తెలుస్తోంది. ఈ ఏడాదిలో మొదటిరోజు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చిన చిత్రంగా సలార్ రికార్డ్ క్రియేట్ చేసింది. తర్వాతి స్థానంలో దళపతి విజయ్ నటించిన 'లియో', ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రాలు ఈ ఏడాదిలో రూ.140 కోట్ల గ్రాస్‌తో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న చిత్రాలుగా ఉన్నాయి.
ఇప్పటి వరకు భారత్‌లో మొదటిరోజు అత్యధిక ఓపెనింగ్స్ కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా ఆర్ఆర్ఆర్ మాత్రమే ఉంది. ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్ రూ.223 కోట్ల రికార్డ్ పదిలంగా ఉంది. ఆ తర్వాత కేజీఎఫ్-2 రూ.165 కోట్ల రికార్డ్‌ను సలార్ దాటేశారు. దీంతో మొదటిరోజు బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రాల జాబితాలో సలార్ రెండో స్థానానికి చేరుకుంది. ఈ రెండు చిత్రాలు సౌత్ ఇండియా నుంచే ఉండటం విశేషం.
వీకెండ్ ధమాకా
అయితే వీకెండ్స్‌లో ఈ సినిమా కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభాస్ ఖాతాలో భారీ వసూళ్లను సాధించిన సినిమా ఇదే అవుతుందని చెబుతున్నారు. ఈ సినిమాకు రెండో భాగం శౌర్యాంగ పర్వంగా టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. సలార్‌లో దేవగా ప్రభాస్, వరద రాజ మన్నార్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్, రాజమన్నార్‌గా జగపతి బాబు, ఆద్యగా శ్రుతి హసన్ కనిపించారు. సలార్ పార్ట్ వన్ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడంతోపాటు పలు భాషల్లో విడుదలైంది. బాలీవుడ్ బాద్షా నటించిన డంకీ సినిమా 21వ తేదీన విడుదలైంది. ఈ రెండు సినిమాల్లో సలార్ భారీ వసూళ్లతో దూసుకుపోతుందని టాక్.
చిరంజీవి సలార్ రివ్యూ!
మరోవైపు, ఈ సినిమాపై ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి తన రివ్యూను ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. 'డియర్ 'దేవా' సలార్ ప్రభాస్‌కు మొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సలార్ సీజ్ ఫైర్ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. కొత్త ప్రపంచాన్ని చూపించిన ప్రశాంత్ నీల్‌కు కుడోస్ పృథ్వీ, శ్రుతి హాసన్, జగపతి బాబు మిగతా టెక్నికల్ టీమ్ సినిమాలో అదరగొట్టేశారు' అని మెగాస్టార్ ప్రతి ఒకరినీ కొనియాడారు. మెగాస్టార్ నుంచి ఊహించని రెస్పాన్స్ రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
మాస్ ఎంటర్టైనర్గా 'సలార్' - ప్రభాస్ ఖాతాలో మరో హిట్ పడిందా?
'సలార్' బడ్జెట్ అన్ని కోట్లా! అందులో సగం యాక్టర్లకే- రెమ్యునరేషన్ ఎవరెవరికి ఎంతంటే?