Prabhas Salaar Update: 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్- రెబల్‌స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న 'సలార్' సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న డార్లింగ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాను ప్రకటించి.. చాలా కాలం అయినా ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ విషయంలో డార్లింగ్ అభిమానులు మేకర్స్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు.
ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ను ఆగస్టు 15 మధ్యాహ్నం 12.58 నిమిషాలకు ప్రకటించిన్నట్లు మేకర్స్ తెలిపారు. అయితే 'సలార్' విడుదల తేదీ ప్రకటిస్తారని తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా శ్రుతిహాసన్ నటిస్తున్నారు. హోంబలే సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రెండు పాత్రల్లో నటించనున్నట్లు టాక్.