Salaar Movie PVR Inox:పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లల్లో 'సలార్' సినిమాను విడుదల చేయకూడదని మూవీ టీమ్ నిర్ణయించుకుంది. ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం సౌత్ఇండియాలో 'డంకీ'తో పాటు 'సలార్'కు పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్‍ల్లో సమానంగా స్క్రీన్లు కేటాయించని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాణ సంస్థ హోంబలె ఫిల్మ్స్ తెలిపింది.
దీనికి కారణం షారుక్ ఖాన్ నటించిన 'డంకీ' సినిమా 'సలార్' కంటే ఒక రోజు ముందు విడుదల కావటం. ఈ మూవీ కోసం నార్త్‌లోని అన్ని పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ చైన్ థియేటర్లును 'డంకీ' నిర్మాతలు బుక్ చేసుకున్నారు. అయితే 'డంకీ'తో పాటు 'సలార్'కు కూడా పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్‍ల్లో సమానంగా స్క్రీన్లు కేటాయించాలని ముందుగా అగ్రిమెంట్ చేసుకున్నారు. దాని ప్రకారం ఇప్పుడు కేటాయించకుండా 'డంకీ'కే ప్రాధాన్యత ఇస్తున్నారని నిర్మాతలు తెలిపారు.
Bookmy Show Servers Crash : తెలుగు రాష్ట్రాల్లో 'సలార్' అడ్వాన్స్ బుకింగ్స్ మంగళవారం రాత్రి ప్రారంభమయ్యాయి. దీంతో మంగళవారం రాత్రి 8.24 గంటలకు ఫ్యాన్స్ అందరూ బుక్ మై షో యాప్ ఓపెన్ చేసి రెడీగా ఉన్నారు. అయితే తెలంగాణ, ఏపీ థియేటర్లలో టికెట్స్ ఓపెన్ చేయడమే ఆలస్యం- ఒక్కసారిగా అందరూ యాప్ ఓపెన్ చేశారు. లక్షలాది మంది ఒకేసారి యాప్ ఓపెన్ చేయటం వల్ల సర్వర్ సమస్య తలెత్తింది. యాప్ కొంతసేపు పని చేయలేదు. దీంతో బుక్ మై షో క్రాష్ అయిన ఫొటోలు స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆయితే బాహుబలి చిత్ర నిర్మాతలలో ఒకరైన శోభు యార్లగడ్డ కూడా ఈ ఫొటోలు షేర్ చేయడం విశేషం.