తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రిలీజ్​కు ఇంకా పదిరోజులే- సలార్ ప్రమోషన్లు ఎక్కడ బాసూ? - Salaar Runtime

Salaar Movie Promotions : మరో 10 రోజుల్లో బాక్సాఫీస్​ వద్ద సై అనేందుకు 'సలార్​' సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే దీనికి సంబంధించిన సినిమా ప్రమోషన్స్ మొదలుకావాలి. అయినా అటువంటి హడావిడి ఏమీ ఈ చిత్ర యూనిట్​లో కనిపించడం లేదు. దీంతో 'సలార్​' మూవీని వాయిదా వేసే యోచనలో నిర్మాతలు ఉన్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Delay In Salaar Movie Promotions
Delay In Salaar Movie Promotions

By ETV Bharat Telugu Team

Published : Dec 11, 2023, 5:35 PM IST

Salaar Movie Promotions : 'బాహుబలి' సినిమాతో పాన్​ఇండియా స్టార్​గా ఎదిగిన ప్రభాస్, మరో 10 రోజుల్లో 'సలార్'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే 'సాహో', 'రాధే శ్యామ్, 'ఆదిపురుష్​' సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వనందున, డార్లింగ్ ఫ్యాన్స్ 'సలార్'​ పైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్​కు ఇంకా కేవలం 10 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. అయినప్పటికీ 'సలార్' ప్రమోషన్స్​ సందడి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. దీంతో సలార్ క్రిస్మస్​ బరిలోనైనా నిలుస్తుందా లేదా అన్న డౌట్ ఫ్యాన్స్​లో మొదలైంది.

సాధారణంగా ఓ సినిమా పాన్​ ఇండియా లెవెల్​లో విడుదల అవుతుందంటే రిలీజ్​కు ఒక నెల ముందు నుంచే హడావుడి మొదలవుతుంది. సాంగ్స్​ రిలీజ్​, ప్రీ-రిలీజ్​ ఈవెంట్స్, నటీనటుల ఇంటర్వ్యూలు అంటూ ప్రమోషన్స్​ కార్యక్రమాలు మొదలైపోతాయి. కానీ, 'సలార్'​ విషయంలో మాత్రం అటువంటి వాతావరణమే కనిపించడం లేదు. మూవీ విడుదలకు ఇంకా 10 రోజులే ఉన్నా నిర్మాతలు, చిత్రబృందం మాత్రం ఈ విషయాల్లో అలసత్వం ప్రదర్శిస్తోంది అనే గాసిప్స్ వినిపిస్తున్నాయి.

ప్రీ-రిలీజ్​​ ఈవెంట్​ డౌటేనా?
'సలార్​' మూవీ టీం ప్రీ-రిలీజ్​ ఈవెంట్​ జరపకుండానే నేరుగా విడుదలకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆశలు కూడా రోజురోజుకు సన్నగిల్లుతున్నాయి. అదే జరిగితే ఓ పెద్ద సినిమా రిలీజ్​కు ముందు పాటించాల్సిన ప్రమోషన్స్​ పద్ధతుల్లేవీ నిర్మాతలు అనుసరించట్లేదని నెగిటివ్​ కామెంట్స్​ వినిపిస్తున్నాయి. ఒకవేళ ప్రమోషన్స్ విషయంలో తాము కాంప్రమైజ్​ అయ్యేదే లేదంటూ మూవీ యూనిట్​ చెప్పినా.. ఇప్పటికే వేదికలను బుక్ చేసి పెట్టుకోవాలి. కానీ 'సలార్'​కు సంబంధించి హైదరాబాద్​లో మాత్రం అలాంటి వాతావరణమే కనిపించటం లేదు. పెద్ద నగరాలైన దిల్లీ, ముంబయి, పుణె, బెంగళూరు, చెన్నైలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చూడాలి మరి ఈ విషయంలో హోంబలే ఫిల్మ్​ మేకర్స్​​ ఏ విధంగా ముందుకు వెళ్తారో. ఇక డిసెంబర్​ 22న'సలార్' గ్రాండ్​గా రిలీజ్​కానున్న విషయం తెలిసిందే!

Salaar Runtime : యాక్షన్ థ్రిల్లర్​గా తెరకెక్కిన సలార్​కు సెన్సార్ బోర్డు 'ఏ' (A) సర్టిఫికెట్‌ను జారీ చేసింది. సినిమా రన్‌టైమ్‌ 2గంటల 55నిమిషాలు ఉండనుంది. ఇందులో హీరోయిన్​గా శ్రుతి హాసన్‌ నటించింది. నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతిబాబు, శ్రియారెడ్డి , ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రలు పోషించారు.

114 రోజుల్లో షూటింగ్​ - ఆ సీక్రెట్​ రివీల్​ చేసిన 'సలార్' డైరెక్టర్​!

'సలార్'​ ట్రైలర్​తో యూట్యూబ్​ షేక్​- హైయెస్ట్​ వ్యూస్​తో నయా రికార్డ్

ABOUT THE AUTHOR

...view details