తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రెండు భాగాలుగా 'సలార్​'.. ఇంటర్వెల్ సీన్​కు అన్ని కోట్లా? - salaar

Salaar Prabhas: 'కేజీఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న యాక్షన్‌ మూవీ 'సలార్'. ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త బయటకు వస్తోంది. తాజాగా 'సలార్'​ను కూడా 'కేజీఎఫ్' తరహాలో రెండు పార్టులుగా తెరకెక్కించాలని ప్రశాంత్ నీల్ ఫిక్స్ అయ్యారట. ఈ సినిమా ఇంటర్వెల్​ సీన్లను కూడా భారీ ఖర్చుతో ఎవరూ ఊహించని విధంగా తెరకెక్కిస్తున్నారని సమాచారం.

Salaar movie
Salaar movie

By

Published : Apr 26, 2022, 8:13 PM IST

Salaar Prabhas: 'కేజీయఫ్‌2'తో యశ్‌ను పూర్తి స్థాయి పాన్‌ ఇండియా హీరోగా మార్చేశారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్​గా మారిన ప్రభాస్​ను ఇంకెలా చూపిస్తారా? అని ఎదురు చూస్తున్నారు డార్లింగ్ అభిమానులు. ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'సలార్‌'. బొగ్గు గనుల నేపథ్యంలో పూర్తిస్థాయి యాక్షన్​తో ఈ సినిమా సాగనుంది. ఈ చిత్రానికి​ సంబంధించి రెండు ఆసక్తికరమైన వార్తలు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

Salaar Two Parts: ప్రశాంత్ నీల్- ప్రభాస్​ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా ఇప్పుడు నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. ఇక 'సలార్‌'ను కూడా 'కేజీఎఫ్' తరహాలోనే రెండు పార్టులుగా తెరకెక్కించాలని ప్రశాంత్ నీల్ ఫిక్స్ అయ్యారట. ఈ మేరకు హోంబలె నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోందని టాక్. ఇప్పుడు ఈ వార్త ట్విట్టర్‌‌ను ఓ రీతిలో షేక్ చేస్తోంది. 'సలార్' హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్​లో ఉంది.

Salaar Interval Sequence: ఈ సినిమా ఇంటర్వెల్‌ సీక్వెన్స్‌ మొత్తం ఓ లోయలో జరుగుతుందట. అండర్‌ గ్రౌండ్‌లో తెరకెక్కే ఆ సన్నివేశాలు తెరపై చూస్తుంటే ఒళ్లు గగురుపొడిచేలా ఉంటాయని అంటున్నారు. అంతేకాదు, లోయలో ఛేజింగ్‌ సన్నివేశాలు కూడా అదరగొట్టేస్తాయని చెబుతున్నారు. మరోవైపు ప్రభాస్‌ స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకుని చిత్ర బృందం సైతం భారీగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. హాలీవుడ్‌ స్థాయిలో సన్నివేశాలు ఉంటాయని చెబుతున్నారు. ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున నిర్మించే యాక్షన్ సీన్ల కోసం మిలటరీ వ్యాన్‌లు, గన్స్ వంటివి కూడా వాడుతున్నారట.

ఈ సినిమాకు సంబంధించి తదుపరి షెడ్యూల్‌కు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. మే మొదటి వారంలో చిత్రీకరణ చేయనున్నారట. సింహభాగం ఈ షెడ్యూల్‌లోనే పూర్తి చేయాలని ప్రశాంత్‌ నీల్‌ భావిస్తున్నారు. ముఖ్యంగా టాకీ పార్ట్ అంతా పూర్తి చేస్తే, వేసవి అయ్యాక.. యాక్షన్‌ సీక్వెన్స్‌ ప్లాన్‌ చేయాలని భావిస్తున్నారట. ఇందుకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇక ప్రభాస్, శ్రుతి హాసన్‌ల మధ్య సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని సమాచారం. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

Prabhas Upcoming Movies: ప్రభాస్​.. సలార్‌తో పాటు ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె సినిమాలు కూడా చేస్తున్నారు. 'ఆదిపురుష్' షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ పనులు నడుస్తున్నాయి. డార్లింగ్​.. మరో చిత్రం 'స్పిరిట్' సినిమాను కూడా ప్రకటించారు. కానీ ఇంకా షూటింగ్ మొదలుపెట్టలేదు. ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెట్టేశారు.

ఇవీ చదవండి:

చిరు తొలిసారి 'నక్సలైట్​'గా చేసిన సినిమా ఏంటో తెలుసా?

'సిద్ధ పాత్రలో పవన్​కల్యాణ్'.. చిరు స్పందన ఇదే

ABOUT THE AUTHOR

...view details