Salaar First Single :పాన్ఇండియా స్టార్ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన 'సలార్' నుంచి తొలి పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఫస్ట్ సింగిల్ పేరుతో 'సూరీడే' అనే పాట లిరికల్ వీడియో బుధవారం విడుదల అయ్యింది. క్రష్ణకాంత్ రాసిన ఈ లిరిక్స్‌కు మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిచగా, హిరనీ ఇవాటురి పాడారు. ప్రస్తుతం ఈ లిరికల్ వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 22న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
Yash In Salaar: ఇదిలా ఉండగా ఈ 'సలార్'లో 'కేజీఎఫ్' హీరో యశ్ ఉన్నాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో నటించిన సింగర్ తీర్థ సుభాష్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో ఆమె 'సలార్‌లో ప్రభాస్‌తో పాటు పృథ్విరాజ్, కేజీఎఫ్ హీరో యశ్ కూడా ఉన్నట్లు చెప్పింది. అంతే ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. అయితే తాజాగా ఆమె ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. 'కేజీఎఫ్ సినిమా ఎన్నో సార్లు చూశాను. ఆ సినిమాలో హీరో యశ్ యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. అందులో మ్యూజిక్ గురించి మా నాన్న ఎప్పుడూ చెబుతుంటారు. దాంతో ఇంటర్వ్యూలో మాట్లాడుతుండగా, కేజీఎఫ్ గుర్తుకు వచ్చి యశ్ పేరు కూడా చెప్పాను అంతే' అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
Salaar Remake : గతంలో కేజీఎఫ్ యూనివర్స్‌లో భాగంగానే సలార్ వస్తుందని రూమర్స్ వినిపించాయి. దీనిపై స్పందించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ రెండింటింకి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. కాగా, తాజాగా సలార్, 'ఉగ్రం'కు రీమేక్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ పుకార్లపై నిర్మాత స్పందించారు. ఇది ఏ సినిమాకు రీమేక్ కాదని స్పష్టం చేశారు. శత్రువులుగా మారే ఇద్దరు స్నేహితుల కథే సలార్ అని చెప్పారు.